లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

A4 Liquor Shops, A4 Liquor Shops in Telangana State Open up to 8.30 PM, Allotment of A4 Liquor Shops to Gouds, Mango News, Orders on quota in liquor shops issued, Orders On Reservations of Allotment of A4 Liquor Shops to Gouds, Reservations for Gouds SCs STs in Liquor Shops Allotment, Reservations of Allotment of A4 Liquor Shops to Gouds, SCs, STs, Telangana Cabinet Approves Reservations for Gouds SCs STs in Liquor Shops Allotment, Telangana Govt Releases Orders On Reservations of Allotment of A4 Liquor Shops to Gouds, Telangana provides quota for Gouds, Telangana provides reservation to Gouds SCs STs in liquor

రాష్ట్రంలో ఏ-4 కేటగిరిలో లిక్కర్ షాపుల కేటాయింపులో గౌడ్ కులస్తులకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు (ఎస్సీ) 10 శాతం, షెడ్యూల్డు తెగలకు (ఎస్టీ) 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబర్ 20, సోమవారం నాడు ప్రభుత్వం జీవో నెంబర్ 87ని విడుదల చేసింది.

తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968 లోని సెక్షన్ 17 (1) (V) అనుసరించి ప్రభుత్వ ఏ-4 రిటైల్ షాపుల లైసెన్సులను 2021-23 సంవత్సరానికి గాను రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిలో భాగంగా గౌడ్ లకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు 10 శాతం, షెడ్యూల్డు తెగలకు 5 శాతం కేటాయిస్తూ ఇచ్చిన జీవోపై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − eight =