వైభవంగా సీఎం కేసీఆర్ ద‌త్త పుత్రిక ప్రత్యూష వివాహం

CM KCR Adopted Daughter Pratyusha Married To Charan Reddy,CM KCR Adopted Daughter,CM KCR Adopted Daughter Pratyusha,CM KCR Adopted Daughter Marriage,KCR Adopted Daughter,CM KCR Adopted Daughter Prathyusha,CM KCR Adopted Daughter Prathyusha Marriage,CM KCR Adopted Daughter Prathyusha Married,KCR Adopted Daughter Marriage,KCR Daughter,CM KCR,KCR Adopted Daughter Pratyusha,KCR Adopted Daughter Pratyusha Marriage,Telangana Chief Minister K Chandrasekhar,Pratyusha,Pratyusha Marriage,Mango News,Mango News Telugu,Pratyusha Married To Charan Reddy,Charan Reddy,KCR Adopted Daughter Pratyusha Married To Charan Reddy,KCR Adopted Daughter Pratyusha Marriage

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం చరణ్ రెడ్డితో సోమవారం నాడు వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రత్యూష, చరణ్‌రెడ్డి వివాహానికి స్థానిక షాద్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, మ‌హిళా సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ దివ్య దేవ‌రాజు సహా పలువురు నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మరోవైపు ఆదివారం నాడు మహిళాభివృద్ది, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో పెళ్లి కూతురును చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ హాజరై వధువు ప్రత్యూషకు పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కవిత మరియు ఇతర శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + one =