తెలంగాణలో ఎల్ఆర్ఎస్ ద‌ర‌ఖాస్తుదారుల‌కు ఊర‌ట‌

Govt will Collect LRS Fee Based on Land Value, Govt will Collect LRS Fee Based on Land Value at the Time of Registration, KTR On LRS Fee, LRS Fee, Minister KTR, Telangana Assembly, Telangana Assembly 2020, Telangana Assembly 8th Day Session

రాష్ట్రంలో ప్లాట్లు, లేఅవుట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు మరో అవకాశం కల్పిస్తూ, సెప్టెంబర్ 1 న తెలంగాణ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ స‌హా రాష్ట్రంలో కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల్లో లే అవుట్‌ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) కు అవ‌కాశం ఇచ్చారు. ఆగస్టు 26 లోపు డెవలప్ చేసిన లే అవుట్లు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ కు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించారు. లేఅవుట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కోసం అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అలాగే ఎల్ఆర్ఎస్ ఫీజును వచ్చే ఏడాది జనవరి 31 లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

అయితే ఎల్ఆర్ఎస్ పై ప్రజల నుండి, పలువురు నాయకుల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ముందుగా ఇచ్చిన జీవో 131 సవరిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ఈ రోజు శాస‌న‌స‌భలో ప్ర‌క‌టించారు. రిజిస్ట్రేషన్ తేదీ నాడు ఉన్న భూముల విలువ(వాల్యూ) ఆధారంగానే ఎల్ఆర్ఎస్ ఫీజు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా గురువారం నాడు సవరించిన జీవోను విడుదల చేస్తామని తెలిపారు. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ప‌ట్ల గౌర‌వంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 10 =