కరోనా వ్యాక్సిన్ పై మరో ముందడుగు, అత్యవసర వినియోగం కోసం భారత్ బయోటెక్‌ దరఖాస్తు

Bharat Biotech Seeks Emergency Use Authorisation For Covaxin Vaccine,Bharat Biotech Seeks Emergency Use Approval For Covaxin,Bharat Biotech Seeks Emergency Use Authorisation for Indian Covid-19 vaccine,Bharat Biotech,Bharat Biotech Covaxin,Covaxin Bharat Biotech,Bharat Biotech Corona Vaccine,Bharat Biotech Vaccine,Covaxin,Covaxin Vaccine Bharat Biotech,Bharat Biotech News,Covaxin Vaccine,Bharat Biotech Covid Vaccine,Bharat Biotech Covid19 Vaccine,Covaxin In Bharat Biotech,Covaxin News,Bharath Biotech,Bharath Biotech Corona Vaccine,Covaxin India,Bharat Biotech Covaxi,Mango News Telugu,Mango News

భారత్‌ బయోటెక్‌ సంస్థ “కొవాగ్జిన్‌” పేరుతో కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ‌కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ సోమవారం నాడు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కు భారత్‌ బయోటెక్ దరఖాస్తు చేసినట్టు తెలుస్తుంది. భారత్‌ బయోటెక్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సహకారంతో తయారుచేస్తున్న ఈ వ్యాక్సిన్‌ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటుంది.

ఇప్పటికే ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన కోవిషిల్డ్ వ్యాక్సిన్ కోసం పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్‌టెక్‌ సంస్థతో కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ లో అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దేశంలో అత్యవసర వినియోగ అనుమతి దరఖాస్తు చేసుకున్న మూడో సంస్థ భారత్ బయోటెక్. ఈ నేపథ్యంలో డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ బుధవారం నాడు సమావేశమై అత్యవసర వినియోగ అనుమతి కోరుతూ ఫైజర్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సమర్పించిన దరఖాస్తులను సమీక్షించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ వ్యాక్సిన్ లకు అనుమతి లభిస్తే, దేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + twelve =