నిరుద్యోగ భృతి తప్పకుండా అమలుచేస్తాం : సీఎం కేసీఆర్

CM KCR, CM KCR announces that RTC Employees Salaries will be Hiked, KCR announces 30% salary hike, KCR announces that RTC Employees Salaries will be Hiked, Mango News, Salaries of RTC employees, Salaries of RTC employees to be hiked, Salaries of RTC employees to be hiked soon, Telangana PRC News, TSRTC, TSRTC salary hike, TSRTC salary hike news, tsrtc salary hike updates

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం నాడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధించబోమని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే వేతనాలు పెంచుతామని చెప్పారు. తెలంగాణ ఉద్య‌మంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరువలేనిదని అన్నారు. ఈ బ‌డ్జెట్‌లో ఆర్టీసీకి రూ.3000 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆర్టీసీని కాపాడుకుంటామని, ఆర్టీసీ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాగే జూనియ‌ర్ పంచాయ‌తీ కార్యదర్శులకు‌ ఈ ఏప్రిల్ నుంచే రెగ్యుల‌ర్ ఉద్యోగులకి ఇచ్చిన జీతాలు ఇస్తామని తెలిపారు. అయితే వారి ప్రొబేషనరీ పీరియడ్ ను మరో ఏడాది పొడిగిస్తునట్టు చెప్పారు.

తప్పకుండా నిరుద్యోగ భృతి అమలుచేస్తాం:

ఇక రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించే విషయంపై కూడా సీఎం కేసీఆర్ మాట్లాడారు. “నిరుద్యోగభృతి ఇవ్వాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంది. కరోనా వలన ఇవ్వలేకపోయినాం. నిరుద్యోగులను గుర్తించడం, వేరే రాష్ట్రాల్లో ఈ నిరుద్యోగ భృతి విధానం ఎలా ఉంది అనే అంశాలపై సమావేశాలు జరిగాయి. అదే సమయంలో సంవత్సరం క్రితం కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి దెబ్బకొట్టింది. ఈ కరోనా పరిస్థితులను అనుసరించుకుని, సెకండ్ వేవ్ ఎలా ఉంటుందో చూసుకుని తప్పకుండా నిరుద్యోగ భృతి అమలుచేస్తాం. అందులో సమస్య ఏమి లేదు” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =