తెలంగాణలో లాక్‌డౌన్ అనేది పెట్టబోము, ఎలాంటి ఆందోళన వద్దు: సీఎం కేసీఆర్

Coronavirus In India, KCR Confirmed that No Lockdown will be Announced, KCR Confirmed that No Lockdown will be Announced In telangana, kcr speech, KCR Speech At Telangana Assembly session, Mango News, Mango News Telugu, No Lockdown will be Announced In telangana, telangana, Telangana Assembly Session, Telangana Budget Assembly session, Telangana CM KCR, Telangana Lockdown News, Telangana Lockdown Rumors, Telangana may soon be Covid-19 free hopes KCR

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ పై చర్చ జరుగుతుండడంతో, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చారు. ‌తెలంగాణ‌లో మరోసారి లాక్‌డౌన్ విధించబోమని పేర్కొన్నారు. “తొందరపడి లాక్‌డౌన్ అనేది పెట్టబోము. పరిశ్రమల మూసివేత అనేది ఉండదు. ఇప్ప‌టికే చాలా దెబ్బ‌తిన్నాం. ఒకేవైపు కరోనాను నియంత్రించడానికి, అరికట్టడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూనే, ఎట్టి పరిస్థితిల్లో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబడదు. తొందరపాటి నిర్ణయాలు ఉండవు. ఎవ్వరు కూడా దయచేసి ఆందోళన చెందవద్దు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండడం, శానిటైజర్స్ వాడడం వలన క‌రోనా ముప్పు తగ్గుతుంది. పంక్షన్స్ లో జనాభాను తగ్గించుకోవడం, ఎక్కువమందితో ఊరేగింపులు తగ్గించుకుంటే మంచిదనే మాట రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో కరోనా విస్పోటన రూపం తీసుకోక ముందే చర్యలు తీసుకున్నాం. బాధ‌తోనే స్కూళ్ల‌ను, విద్యాసంస్థలను మూసివేశాం. విద్యాసంస్థ‌ల‌ను కూడా తాత్కాలికంగానే మూసివేశామనే విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గ్రహించాలి” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + one =