ముందు ఎన్నికల సమరశంఖం పూరించేదెవరు..?

Who Will Fill The Pre Election Polls, Pre Election Polls, Who Will Fill Polls, CM Revanth Reddy, KCR, BRS, Congress, Lok Sabha Elections, Pre Election PollS News, TS Pre Election Polls, Latest Pre Election Polls, Election Polls, TS CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News Telugu
CM Revanth reddy, KCR, BRS, Congress, Lok sabha elections

లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా కాకముందే.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హీట్ రగులుతోంది. అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలు దక్కించుకొని ఢిల్లీలో సత్తా  చాటాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల కోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. లోక్‌సభ స్థానాలవారీగా ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది. నియోజకవర్గంలో పార్టీ బలాబలగాలు.. ఎన్నికలవేళ అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది.

అటు తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టేసింది. ఈసారి తెలంగాణలో 17కు 17 స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలపై ఫోకస్ పెట్టిన టి.కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల కదనరంగంలో ఎవరు ముందు దూకుతారనేది ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి ముందు ప్రజాక్షేత్రంలోకి వెళ్తారా..? లేదా కేసీఆర్ వెళ్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లిన కేసీఆర్.. ఆ తర్వాత కాలు జారిపడడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొని హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉంటున్నారు. అయితే త్వరలోనే కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారని.. ఫిబ్రవరిలో జిల్లాల పర్యటన చేపడుతారని అంటున్నాయి.

అటు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అధికారికంగా ఏ జిల్లాలోనూ రేవంత్ రెడ్డి పర్యటించలేదు. ఈక్రమంలో త్వరలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాల పర్యటన చేపడుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 26 తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తారని అంటున్నాయి. అటు త్వరలో జిల్లాల పర్యటన చేపడుతానని రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలి సభను ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య ఇద్దరూ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈసారి ఎన్నికల ప్రచారాలు మరింత రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 12 =