నేటి నుంచి నాలుగు రోజుల పాటుగా మేడారం మినీ జాతర

2021 Mini Medaram Jatara, Lakhs head to Medaram for Mini Jatara, Mango News, Medaram, Medaram Jatara, medaram jatara 2021 dates, Medaram Jatara News, Medaram Mini Jatara, Medaram Mini Jatara Started, Medaram Mini Jatara Started From Today, Mini Medaram 2021 Dates, Mini Medaram Jatara 2021, Mini-Medaram Jatara, Sammakka Jatara, Sammakka Saralamma, Sammakka Saralamma Jatara, Telangana Medaram Jatara

ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో మినీ జాతర నేడు ప్రారంభమైంది. ఈ మేడారం మినీ జాతర ఫిబ్రవరి 24 నుండి ఫిబ్రవరి 27 వరకు జరగనుంది. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మల జాతరకు భక్తులు పెద్దఎత్తున తరలి రానున్న నేపథ్యంలో వారికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించి అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే కరోనా నేపథ్యంలో మినీ జాతరకు వచ్చే భక్తులు నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రానున్నారు. జాతర సందర్భంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

మరోవైపు మేడారం మినీ జాతర ప్రారంభం సందర్బంగా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం పర్యటనలో భాగంగా ముందుగా ములుగులోని గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం మినీ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సుల ఏర్పాటు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, ట్రాఫిక్ ఇలా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − one =