పోలవరం అవినీతి 15 రోజుల్లో బయటకు తీస్తా

Andhra Pradesh Political News, CM YS Jagan Comments On Corruption In Polavaram Construction, CM YS Jagan dissatisfied over Polavaram, CM YS Jagan Latest News, Mango News, Polavaram Project latest Updates, YS Jagan Corruption In Polavaram, YS Jagan Counter to Chandrababu over Polavaram, YS Jagan Takes Action Against Corruption In Polavaram

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి, అందులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ పై చర్చ జరపాలని టిడిపి సభ్యులు పట్టుపట్టారు. గత మూడు రోజులు నుండి ప్రాజెక్ట్ అంశాలపై చర్చిస్తూనే ఉన్నామని, టిడిపి సభ్యుల చేస్తున్న ఆందోళన పై ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. తదనంతరం జగన్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ గత టిడిపి ప్రభుత్వ హయాంలో అవినీతిమయంగా మారి స్కాముల ప్రాజెక్టుగా మారిందని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ పై నిపుణుల ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తుందని, పోలవరంలో ఎంత దోచుకున్నారో మరో 15 రోజుల్లో బయటపడుతుందని తెలిపారు .

కొన్ని రోజుల క్రితమే, పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి పనులను పరిశీలించి వచ్చానని, చంద్రబాబు కారణంగానే నాలుగు నెలలుగా పనులు జరగడం లేదని ఆరోపించారు. నవంబర్ 1 నుంచి పనులు తిరిగి ప్రారంభించి, జూన్ 2021 నాటికీ పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. పోలవరం పై రివర్స్ బిడ్డింగ్ కి వెళ్తున్నామని, నిర్మాణంలో డబ్బు ఆదా చేసే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బిడ్డింగ్ లో ఎవరు తక్కువుగా కోట్ చేస్తే వారికే పనులు అప్పగిస్తామని, టిడిపి హయాంలో ఇష్టానుసారంగా కేటాయించారని, యనమల వియ్యంకుడు కూడ సబ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడని, త్వరలో అన్ని విషయాలను వెలుగులోకి తెస్తామని టిడిపి నాయకులను హెచ్చరించారు.

 

[subscribe]
[youtube_video videoid=FYCcas7wIH8]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 17 =