నిజామాబాద్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో దిల్ రాజ్ పోటీ..?

Dil Raj To Contest Lok Sabha Elections From Nizamabad, Dil Raj To Contest Lok Sabha Elections, Lok Sabha Elections From Nizamabad, Dil Raj Contest From Nizamabad, Lokh Sabha Elections, Congress, Producer Dillraju, Nizamabad, Latest Dil Raj Lok Sabha Elections News, Dil Raj Lok Sabha Elections Contest News, TS Lokh Sabha Elections, TS CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Lokh sabha elections, Congress, Producer Dillraju, Nizamabad

సినీ నిర్మాత దిల్ రాజ్.. కొద్దిరోజులుగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దిల్ రాజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. కానీ ఎన్నికలొచ్చే సరికి ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే గతంలో ఓసారి తనకు అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్ సభ ఎన్నికల్లోనే పోటీ చేయాలని ఆసక్తి ఉందని దిల్ రాజ్ వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీ తరుపున పోటీ చేసినా కచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పుకొచ్చారు. ఈక్రమంలో త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో దిల్ రాజ్ పేరు ఇప్పుడు మారు మ్రోగిపోతోంది.

లోక్ సభ ఎన్నికలకు మరో నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉంది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలకు పలు సూచనలు చేసింది. లోక్ సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 17కు 17 స్థానలు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణపై కోటి ఆశలు పెట్టుకుంది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది .

ఈక్రమంలో దిల్ రాజ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరుపున దిల్ రాజ్ నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.  అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా దిల్ రాజ్‌కు నిజామాబాద్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.  అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు కూడా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి సొంత పార్టీ నేతలు, పైగా సీనియర్లను కాదని.. దిల్ రాజ్‌కు హైకమాండ్ టికెట్ ఇస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + five =