రాష్ట్ర, దేశ ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR Extends Greetings To All on The Occasion of Maha Shivaratri Festival,Mango News,Mango News Telugu,CM KCR,CM KCR Live,CM KCR Live Updates,CM KCR Latest News,CM KCR News,CM KCR Latest Updates,CM KCR Live News,CM KCR Latest,Maha Shivratri,2023 Maha Shivratri,Maha Shivratri 2023,CM KCR Extends Greetings,CM KCR Extends Greetings on Maha Shivratri,CM KCR Greet People On Maha Shivratri,CM KCR Extends Wishes On Maha Shivaratri,CM KCR Maha Shivratri Greetings,CM KCR Shivratri Greetings,CM KCR Extends Greetings,KCR Extends Greetings,KCR Latest News

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హిందువులు మహా శివరాత్రి రోజున విశేష భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇక ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించిన ఆయన, ఆ మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. అలాగే లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ అభిలషించారు. కాగా మరోవైపు రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తుల రాకతో సందడిగా మారాయి. ఈ క్రమంలో నేటి ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 16 =