ఉమెన్స్ ప్రీమియర్ లీగ్: ఆర్‌సీబీ మహిళా జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన.. ప్రకటించిన విరాట్ కోహ్లీ, ఫా డుప్లెసిస్

WPL 2023 Virat Kohli and Faf du Plessis Announces Smriti Mandhana Named RCB Women's Team Captain,Mango News,Mango News Telugu,Virat Kohli,Virat Kohli Live,Virat Kohli Live Updates,Virat Kohli Latest News,Virat Kohli News,Virat Kohli Latest Updates,Virat Kohli Live News,Virat Kohli Latest,WPL 2023,WPL,Virat Kohli and Faf du Plessis,Smriti Mandhana Named RCB Women's Team Captain,Smriti Mandhana,Smriti Mandhana Latest News,Smriti Mandhana News,Smriti Mandhana Live Updates,Smriti Mandhana Live News,Smriti Mandhana Named RCB Women's Captain,RCB Women's Team Captain,RCB Women's Team Captain Smriti Mandhana,Royal Challengers Bangalore Name Smriti Mandhana As Women’s Team Captain,Women's Premier League,Smriti Mandhana Named RCB Captain,RCB Announces Smriti Mandhana As Women's Team Captain,Royal Challengers Bangalore,Bangalore,Royal Challengers,RCB

మరికొన్ని రోజుల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదలవనున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. తమ మహిళల జట్టుకు భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానను కెప్టెన్‌గా నియమించింది. ఈ మేరకు ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు ఇటీవలే ఆర్‌సీబీ పురుషుల జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన డుప్లెసిస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఆర్‌సీబీ పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ ప్రకటించారు. కాగా మంధానను ఆర్‌సీబీ ఇటీవలే జరిగిన మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ వేలంలో రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఆమె లీగ్‌లో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. ఈ సందర్భంగా.. ‘ఇప్పుడు మరో 18వ నంబర్ ఆర్‌సిబి జట్టుకు నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సిబి జట్టుకు నాయకత్వం వహించే స్మృతి మంధాన గురించి మేము మాట్లాడుతున్నాము’ అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అలాగే, డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘మా మహిళా కెప్టెన్‌కి ఆర్‌సిబిని నడిపించే అన్ని లక్షణాలు ఉన్నాయని నాకు చాలా నమ్మకం ఉంది’ అని అన్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − nine =