సీఎం కేసీఆర్ దంపతుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో ఘనంగా గోదాదేవి కళ్యాణం

CM KCR Family held Goda Devi Kalyana Mahotsavam at Pragathi Bhavan, CM KCR Family held Goda Devi Kalyana Mahotsavam, Goda Devi Kalyana Mahotsavam, Pragathi Bhavan Goda Devi Kalyana Mahotsavam, CM KCR Family, Telangana CM KCR, Pragathi Bhavan, Goda Devi Kalyana Mahotsavam News, Goda Devi Kalyana Mahotsavam Latest News And Updates, Goda Devi Kalyana Mahotsavam Live Updates, Mango News, Mango News Telugu

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పవిత్ర హృదయంతో శ్రీ రంగనాథుని నిత్య పూలమాలతో సేవించి, ఆ శ్రీవారికే తన జీవితాన్ని అర్పించిన మహా భక్తురాలు గోదాదేవి కళ్యాణ మహోత్సవం, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగింది. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణ మహోత్సవం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, శోభమ్మ దంపతుల ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల నడుమ కన్నుల పండుగగా కొనసాగింది. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు సాగే శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సోదరీమణులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 13 =