ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

2021 World Water Day, CM KCR conveys World Water Day Greetings, CM KCR extends World Water Day greetings, CM KCR Greeted People in the State, CM KCR Greeted People in the State on the Occasion of World Water Day, CM KCR greets people of state on World Water Day, kcr speech, KCR Speech in Telangana Assembly, KCR Speech in Telangana Assembly Budget Session, Mango News, Mango News Telugu, Telangana CM KCR, World Water Day, World Water Day 2021

ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు వంటి సహజ వనరులను కాపాడడం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడమే రేపటి తరానికి మనం కూడబెట్టే అత్యంత విలువైన సంపదని అన్నారు. తెలంగాణలో అడుగంటి పోయిన జలాలను తిరిగి సమకూర్చే దిశగా సాగునీటి, తాగునీటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణలో భూఉపరితల జలాల లభ్యతను పెంచడం, తద్వారా అడుగంటిన భూగర్భ జలాలను భూ పైపొరల్లోకి చేరే విధంగా, జల పునరుజ్జీవన జరుగుతున్నదన్నారు.

తెలంగాణ ప్రజలకు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన, శుద్ధిచేసిన, సురక్షిత తాగునీటిని గడప గడపకూ అందించడం ద్వారా తెలంగాణ తాగునీటి కష్టాలను పారదోలడమే కాకుండా, ఫ్లోరైడ్ వంటి ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపిందన్నారు. గడచిన ఆరేండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన పటిష్ట చర్యల ద్వారా తెలంగాణ జల వనరుల స్వరూపం గుణాత్మకంగా అభివృద్ధి చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహా ప్రపంచ జల వనరుల నిపుణులు తెలంగాణలో జరుగుతున్న జల పునరుజ్జీవన కార్యక్రమాలను కొనియాడుతుండటం మనకు గర్వ కారణమని సీఎం కేసీఆర్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 1 =