డీజీపీ గౌతమ్‌ సవాంగ్, పోలీస్ శాఖ సిబ్బందిని అభినందించిన సీఎం వైఎస్ జగన్

Andhra CM Jagan Shunts Out DGP, Andhra Pradesh, Andhra Pradesh top cop emerges Best DGP, AP Police Department Wins 125 National Awards, CM Jagan Congratulated DGP, CM Jagan Congratulated DGP Gautam Sawang, CM Jagan Congratulated DGP Gautam Sawang and other Police Personnel of the State, Jagan Mohan Reddy, Mango News, Sawang receives best DGP award, YS Jagan Mohan Reddy

అత్యుత్తమ పోలీసింగ్‌లో ఉత్తమ డీజీపీ, స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్ అవార్డు సహా 13 జాతీయ అవార్డులను ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ను, ఇతర పోలీస్‌ శాఖ సిబ్బందిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి అభినందించారు. సోమవారం నాడు క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ జాతీయ స్థాయి పురస్కరాలు పొందడం పట్ల సీఎం వైఎస్ జగన్ డీజీపీకి అభినందనలు తెలియజేశారు.

ముందుగా దేశంలో పోలీసింగ్ డొమైన్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ‘స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్’ విభాగంలో ప్రతిష్టాత్మక ఫిక్కీ అవార్డును ఏపీ పోలీస్ శాఖ దక్కించుకుంది. పోలీసు శాఖలో అనేక సాంకేతిక సంస్కరణలు చేపట్టి, బలీయమైన విజయాలు సాధించినందుకు ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ఉత్తమ డీజీపీగా ఎంపికయ్యారు. 72 వ స్కోచ్ గ్రూప్ సమ్మిట్ లో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అలాగే ఇంటెరో‌పెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్‌) యొక్క‌ ప్రధాన విధానాలను అనుసంధానించడంలో ఉత్తమ పనితీరును చూపించినందుకు ఏపీ పోలీసుశాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నుంచి అవార్డు దక్కించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + ten =