పురపాలక చట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం కెసిఆర్

CM KCR Introduces New Municipal Act Bill In Assembly
CM KCR Introduces New Municipal Act Bill In Assembly

ఈ రోజు తెలంగాణ శాసన సభ ప్రత్యేక సమావేశాలు మొదలయ్యాయి, ఈ సమావేశాలు గురువారం, శుక్రవారం కొనసాగుతాయి, ఇందులో పలు బిల్లులపై చర్చ జరపనున్నారు. సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్తగా రూపొందించిన రాష్ట్ర పురపాలక చట్టం-2019 బిల్లును ప్రవేశ పెట్టారు, ఇవాళ సాయంత్రం వరకు ఈ బిల్లుపై సవరణలను ప్రభుత్వం స్వీకరించనుంది. ఈ బిల్లు పై శుక్రవారం నాడు సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదించనున్నారు. ఇదే కాకుండా మెడికల్ కాలేజీలలో లెక్చరర్ల పదవి విరమణ బిల్లు కూడ ప్రవేశ పెట్టారు. ప్రొఫెసర్లు గా మారడానికి సీనియారిటీ ప్రకారం నియామకం జరుపుతుండడం వలన వారి వయో పరిమితిని పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు కెసిఆర్ తెలిపారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కూడ మద్దతు తెలుపడంతో ఈ బిల్లు సభలో ఆమోదం పొందింది.

చర్చ సమయంలో కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సమస్యలు వదిలేసి ఇతర పార్టీ నాయకుల పైనే దృష్టి పెట్టిందని, 12 మంది కాంగ్రెస్ సభ్యులను తెరాస లో విలీనం చేసుకున్నారని చర్చకు కోరగా, ఆ అంశం కోర్టు పరిధిలో ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చర్చకు నిరాకరించారు. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందిస్తూ, విలీనం రాజ్యాంగ బద్ధంగానే జరిగిందని బదులిచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని చెప్పారు. మున్సిపాలిటీల సంఖ్యను 142 కు పెంచమని, కొత్త పురపాలక చట్టం తీసుకొస్తున్నామని,త్వరలోనే బడ్జెట్ సమావేశాలు కూడ నిర్వహిస్తానని పేర్కొన్నారు. కొత్త పురపాలక చట్టానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, భట్టి విక్రమార్క సభలో ప్రకటించారు.

 

[subscribe]
[youtube_video videoid=pOmM2ZBixHE]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =