చంద్రయాన్-2 ప్రయోగం, జూలై 22 న ఖరారు చేసిన ఇస్రో

Chandrayaan 2 Latest Updates, Chandrayaan 2 launch Date, Chandrayaan 2 launch Rescheduled, Chandrayaan 2 to be launched on July 22, ISRO Looking at July 22 for Chandrayaan 2 relaunch, ISRO Says Chandrayaan 2 To Be Launched On July 22, ISRO to launch Chandrayaan 2 on July 22, Mango News

జూలై 15న సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మక మిషన్ చంద్రయాన్ -2 ప్రయోగాన్ని మళ్ళీ జూలై 22 మధ్యాహ్నం 2.43 గంటలకు నిర్వహించబోతున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో గురువారం నాడు అధికారికంగా ప్రకటన విడుదల చేసారు.’ జూలై 15, 2019 న సాంకేతిక కారణాలతో నిలిపివేయబడిన చంద్రయాన్ -2 ప్రయోగం, జూలై 22, 2019, సోమవారం మధ్యాహ్నం 2:43 గంటలకు కి షెడ్యూల్ చేయబడింది ‘ అని తెలియజేసారు.

ఈ నెల 15న తెల్లవారుజామున చంద్రయాన్-2 ప్రయోగం మరో 56 నిమిషాల్లో నిర్వహించబడనుంది అనే సమయంలో క్రయోజనిక్ ఇంజిన్ ట్యాంకర్ లో లీకేజీ గమనించడంతో ప్రయోగాన్ని వాయిదా వేసి,త్వరలోనే ప్రయోగ తేదిని ప్రకటిస్తామని ఇస్రో అధికార ప్రతినిధి గురు ప్రసాద్ ప్రకటించారు. దీని తరువాత శాస్త్ర వేత్తలు వాహననౌక ని ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల పరీక్షలు చేపట్టారు, సాంకేతిక సమస్యను సరిదిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు. మళ్ళీ ఆదివారం నుండి 20గంటల కౌంట్ డౌన్ మొదలెట్టి, సోమవారం మధ్యాహ్నం 2 గంటల 43 నిముషాలకు జీఎస్ఎల్వి మార్క్-3ఎం1, చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని చంద్రుని మీదకు తీసుకెళ్లనున్నట్టు తెలియజేసారు.

 

[subscribe]
[youtube_video videoid=Q5MzUpSLOXo]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 5 =