హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం ముకర్రమ్ ఝా పార్థివదేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్

CM KCR Paid Tributes to Mortal Remains of Last Nizam of Hyderabad Late Mukarram Jah at Chowmahalla Palace in Hyderabad,Eighth Nizam Burial Ceremony Today, Telangana Home Minister Mourns Death,Demise of Mukarram Jah,Last Nizam of Hyderabad,Mango News,Mango News Telugu,Prince Azmet Jah,Mukarram Jah Net Worth,Mukarram Jah Wife,Mukarram Jah Son,Mukarram Jah Family,Mukarram Jah Residence,Mukarram Jah School,Mukarram Jah Ansari,Mukarram Jah College,Mukarram Jah Engineering College Hyderabad,Mukarram Jah School Admission 2022-23,Mukarram Jah House,Prince Mukarram Jah,Where Is Mukarram Jah Now,Where Does Mukarram Jah Live,Nizam Mukarram Jah

చౌమహల్లా ప్యాలెస్‌లో హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ సిద్దికీ ముకర్రమ్ ఝా పార్థివదేహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం అల్లాను ప్రార్థించారు. విషాదంలో ఉన్న నిజాం కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం వెంట రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎ.జీవన్ రెడ్డి, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఈ.ఆంజనేయ గౌడ్, వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్ మహ్మద్ సలీం తదితరులు ఉన్నారు.

ముందుగా ఎనిమిదో నిజాం ముకర్రమ్ ఝా పార్థివదేహన్ని మంగళవారం ప్రత్యేక విమానంలో టర్కీలోని ఇస్తాంబుల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుండి చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించి, ప్రముఖుల సందర్శనార్ధం చౌమహల్లా ప్యాలెస్‌ లోని దర్బార్ హల్ లో ఉంచారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మంగళవారం 7 గంటల ప్రాంతంలో ప్యాలెస్ కు చేరుకుని, ముకర్రమ్ ఝా పార్థివదేహానికి నివాళులు అర్పించారు. మరోవైపు బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు సందర్శనార్ధం ముకర్రమ్ ఝా పార్థివదేహాన్ని ప్యాలెస్‌ లోని దర్బార్ హల్ లోనే ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభించి, మక్కామసీదుకు చేరుకొని అక్కడే ఎనిమిదో నిజాం ముకర్రమ్ ఝా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here