తెలంగాణలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Azaadi Ka Amrut Mahotsav, Azaadi Ka Amrut Mahotsav Committee Meeting, Azadi ka Amrit Mahotsav For 75 Years Of India’s Independence, Azadi Ka Amrut Mahotsav, Azadi Ka Amrut Mahotsav at Public Gardens, Azadi Ka Amrut Mahotsav In Telangana, Azadi Ki Amrut Mahotsav, CM KCR, CM KCR Participated in Azadi Ka Amrut Mahotsav, CM KCR Participated in Azadi Ka Amrut Mahotsav at Public Gardens, Mango News, Public Gardens, telangana, Telangana Azadi Ka Amrut Mahotsav, Telangana CM KCR, Telangana to celebrate Azadi Ki Amrut Mahotsav

స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను 75 వారాలు పాటుగా ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, పలువురు అధికారులు హాజ‌ర‌య్యారు. మరోవైపు వరంగల్ లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.

మార్చి 12, 2021 నుండి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ఈ ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. అలాగే ఈ మహోత్సవాలకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. 75 వారాల పాటుగా రాష్ట్రవ్యాప్తంగా జరిపే ఈ ఉత్సవాల్లో భాగంగా దేశభక్తిని పెంపొందించేలా వివిధ స్థాయిల్లో ఫ్రీడం రన్, కవి సమ్మేళనాలు, వ్యాస రచన, ఉపన్యాసం, చిత్రలేఖన పోటీలతోపాటు ఇతర సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 1 =