తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 181 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 11, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,717 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరొకరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1650 కి పెరిగింది. ఇక గత 24 గంటల్లో 163 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 2,97,195 కు చేరుకుంది. ప్రస్తుతం 1,872 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గురువారం నాడు 21,340 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 91,14,985 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,44,894 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ