వివిధ విభాగాల్లో తెలంగాణకు 13 జాతీయ అవార్డులు.. అధికారులకు సీఎం కేసీఆర్‌ అభినందనలు

CM KCR Praises Gram Panchayats For Bagging 13 National Awards For Rural Development In Telangana,CM KCR Praises Gram Panchayats,Gram Panchayats Bagging 13 National Awards For Rural Development,Rural Development In Telangana,Mango News,Mango News Telugu,National Panchayat Awards 2023,KCR Delighted Over Telangana Villages,KCR Compliments Panchayat Raj Department,Telangana Received 13 Out Of 46 Awards,Telangana Bags 13 Gram Panchayat Awards,13 National Panchayat Awards For Telangana,CM KCR News And Live Updates,Telangana Latest News And Updates,National Panchayat Awards Latest News

పచ్చదనం మరియు పరిశుభ్రతతో సహా 46 జాతీయ గ్రామ పంచాయతీ అవార్డులలో తెలంగాణ సోమవారం 13 అవార్డులను అందుకుంది. దీనిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ అవార్డులు అందుకున్న దయాకర్‌ రావు, కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ హనుమంతరావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌లు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ అభినందించారు. మొత్తం తొమ్మిదికి గానూ, ఎనిమిది విభాగాలలో అవార్డులు గెలుచుకోవడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతతో సహా పలు అభివృద్ధి అంశాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్ర గ్రామ పంచాయతీలకు అభినందనలు అని పేర్కొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న గ్రామీణాభివృద్ధికి, ముఖ్యంగా పల్లె ప్రగతికి నిదర్శనమని, దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

కాగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ గ్రామ పంచాయతీలకు ఈ అవార్డులను అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు సర్పంచ్‌లు న్యూఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డులు అందుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా, అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు పొందాయి. ఇందులో తెలంగాణ 13 అవార్డులను గెలుచుకుంది. అంటే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 30 శాతం తెలంగాణకు దక్కడం విశేషం. వీటిలో ఎనిమిది దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాలు, ఐదు నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాలు అందుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − five =