శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

AP CM YS Jagan, CM Jagan Welcomed President at Renigunta, Mango News Telugu, President, President Ram Nath Kovind, President Ram Nath Kovind Visits Tirumala Tirupati, President Ramnath Kovind, President Ramnath Kovind Visit to Tirumala, President to visit Tirumala, Ram Nath Kovind visit Tirumala, Tirumala, Tirumala Tirupati Devasthanam, Tirupati

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 24, మంగళవారం నాడు తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ముందుగా ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్,‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి దంపతులు ముందుగా రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం 12.15 గంటలకు తిరుమలలోని విశ్రాంతి గృహానికి రాష్ట్రపతి చేరుకుంటారు. ఇక మధ్యాహ్నం 12.50 గంటలకు శ్రీ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయంలోకి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం 4.50 గంటలకు మళ్ళీ రేణిగుంట చేరుకుని రాష్ట్రపతి దంపతులు తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి తిరుమల పర్యటన నేపథ్యంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అధికారులుకు కీలక సూచనలు చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − thirteen =