మంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్, ఐఐటీ విద్యార్థిని చదువుకి ఆర్థిక సహాయం

IIT Student From Warangal, KTR extends financial aid to IIT student from Warangal, KTR Extends Financial Assistance to IIT Student, KTR Extends Financial Assistance to IIT Student From Warangal, KTR extends financial assistance to young IIT student, KTR funds Warangal girl’s IIT education, Mango News, Minister KTR Extends Financial Assistance to IIT Student, Minister KTR Extends Financial Assistance to IIT Student From Warangal, Warangal

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఐఐటీలో సీటు దక్కించుకుని, ఆర్ధిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేక ఇబ్బంది పడుతున్న మేకల అంజలి అనే విద్యార్థినికి ఇచ్చిన హామీ మేరకు మరోసారి ఆర్ధిక సహాయం అందించారు. ముందుగా వరంగల్ జిల్లా హసన్‌పర్తికి చెందిన మేకల అంజలి రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. కాగా పేదరికం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయాలని మంత్రి కేటిఆర్ ను విన్నవించుకుంది. మంత్రి కేటీఆర్ వెంటనే మేకల అంజలి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని, తన వ్యక్తిగత హోదాలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆమె ఫీజులకు అవసరమైన నగదును అందిస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో అంజలికి ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది మరియు వచ్చే ఏడాదికి సంబంధించిన ఐఐటీ ఫీజుల మొత్తాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం నాడు అంజలి కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా అంజలి చదువు మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె తన చదువును దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే తమ కూతురు ఐఐటీ విద్యకు పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల అంజలి కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =