నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం.. పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, భారీగా హాజరైన టీడీపీ శ్రేణులు

TDP National General Secretary Nara Lokesh Yuvagalam Padayatra Begins in Kuppam,Maha Padayatra Today,Maha Padayatra Schedule,Maha Padayatra Live Today,Yuvagalam Padayatra Today,Yuvagalam Padayatra Schedule,Mango News,Mango News Telugu,Yuvagalam Padayatra 2 0 Route Map,Maha Padayatra Route Map,Yuvagalam Padayatra Route Map,Maha Padayatra,Maha Padayatra Live,Maha Padayatra 2.0 Route Map,Maha Padayatra Route,Amravati Maha Padayatra,Amaravathi Maha Padayatra Route Map,Yuvagalam Farmers Maha Padayatra,Amravati Maha Padayatra Route Map,Yuvagalam Farmers Maha Padayatra Route Map,Yuvagalam Maha Padayatra,Mahatma Gandhi Padayatra

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లోకేష్ 11గంటల 3 నిమిషాలకు పాదయాత్రలో భాగంగా తొలి అడుగు వేశారు. కాగా 400 రోజులపాటు కొనసాగనున్న ఈ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ఆయన ఏపీ వ్యాప్తంగా 4 వేల కిలోమీటర్ల దూరం నడవనున్నారు. ఇక అంతకుముందు నారా లోకేష్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాత్రికి కుప్పం చేరుకుని, ఈ ఉదయం స్థానిక వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మామ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కుప్పం చేరుకుని లోకేష్ తో పాటు పూజలలో పాల్గొన్నారు.

అనంతరం హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. అలాగే ముస్లిం ఇమామ్ ల సమక్షంలో ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు. కాగా పార్టీ కార్యకర్తలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న లోకేష్ పాదయాత్ర కుప్పంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు పలువురు టీడీపీ నాయకులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు కుప్పంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణం మొత్తం ఎక్కడ చూసినా టీడీపీ జెండాలు, బెలూన్లు, బ్యానర్లు కనిపించడంతో కుప్పం పసుపుమయంగా మారింది. ఇక పాదయాత్ర ప్రారంభమయ్యాక దారి మధ్యలో డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి లోకేష్ నివాళులర్పించారు. మధ్యాహ్నం 1:05 గంటలకు కుప్పం బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి, అలాగే మధ్యాహ్నం 1:25 గంటలకు కొత్త బస్టాండ్ దగ్గర పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు.

కాగా ఈరోజు 8.5 కి.మీ దూరం యత కొనసాగనుంది. మధ్యాహ్నం కుప్పంలో జరుగనున్న తన తొలి భారీ బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించనున్నారు. ఇక దీనిపై టీడీపీ.. ‘రాష్ట్రం కోసం, యువత కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ కుటుంబ బాగు కోసం, కుంటుపడిన అభివృద్ధి కోసం, ఆగిపోయిన పోలవరం కోసం, నిలిచిపోయిన అమరావతి కోసం’ నారా లోకేష్ యాత్ర చేపడుతున్నారు’ అని ప్రజలకు సందేశమిచ్చింది. కాగా పార్టీకి పూర్వ వైభవం తేవడంతో పాటు తనను తాను నిరూపించుకునేందుకు నారా లోకేష్ కు ఇది ఒక పరీక్షగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఈ యాత్ర పూర్తైతే ఇప్పటి వరకూ రాష్ట్రంలో నిర్వహించిన అతిపెద్ద రాజకీయ పాదయాత్రగా నారా లోకేష్ యువగళం నిలవనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =