టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి

Congress Senior Leader Marri Shashidhar Reddy Sensational Comments on TPCC Chief Revanth Reddy, Marri Shashidhar Reddy Sensational Comments on TPCC Chief Revanth Reddy, Sensational Comments on TPCC Chief Revanth Reddy, Congress Senior Leader Marri Shashidhar Reddy, TPCC Chief Revanth Reddy, Marri Shashidhar Reddy, Congress Senior Leader, TPCC Chief Revanth Reddy News, TPCC Chief Revanth Reddy Latest News And Updates, TPCC Chief Revanth Reddy Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో అంతర్గత విభేదాలతో సతమతవుతున్న కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లడం తెలిసిందే. ఇదే క్రమంలో మరికొందరు కూడా పార్టీని వీడుతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌పై మండిపడ్డారు. మాణిక్కం ఠాగూర్‌ రాష్ట్ర ఇంచార్జి గా కాకుండా రేవంత్ రెడ్డి ఏజెంట్‌గా మారారని శశిధర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక పార్టీలోని సీనియర్లకు సరైన గౌరవం లేదని, సీనియర్లను గోడకేసి కొడతా అని రేవంత్ రెడ్డి కామెంట్ చేసినప్పటికీ అధిష్టానం పిలిచి మందలించలేదని శశిధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే పార్టీలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ తీరు సరికాదని, పార్టీని నడిపిస్తున్నవారే కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమవుతున్నారని శశిధర్ రెడ్డి అన్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు అంటూ ఆయన మండిపడ్డారు. ఇక ఇదిలా ఉండగా మునుగోడు నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఈ దీనిలో భాగంగా రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌ నేడు హైదరాబాద్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం మునుగోడు నియోజకవర్గంలోని మండలాలకు ఇంచార్జ్‌లుగా నియమితులైన నేతలతో మాణిక్కం ఠాగూర్ భేటీ అయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 7 =