తెలంగాణలో కరోనా : కొత్తగా 111 పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు 856

Covid-19 in Telangana 111 Positive Cases 129 Recoveries Reported on September 12th, Telangana Records 111 New Covid Cases, 129 Recoveries In 24 Hours , Mango News, Mango News Telugu, India Logs 111 Covid Positive Cases, 111 New COVID19 Cases In Telangana, COVID19 Cases In India, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, India COVID News, CARONA, COVID News And Updates, Carona Vaccine

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 856 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కోత్తగా 111 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 12, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,36,052 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 52 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. కరోనా రికవరీ రేటు 99.41 శాతంకాగా, మరణాల రేటు 0.49 శాతంగా నమోదైంది.

ఇక గత 24 గంటల్లో 129 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 8,31,085 కు చేరుకుంది. ప్రస్తుతం 856 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. సోమవారం నాడు 10,288 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,74,99,673 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 10,07,514 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే ఇంకా 358 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 8 =