తెలంగాణలో కొత్తగా నియమితులైన అదనపు కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం

CS Somesh Kumar held Meeting with Newly Appointed Additional Collectors of Local Bodies in the State,CS Somesh Kumar,Meeting with New Collectors,CS Somesh Kumar Meeting Local Bodies,Mango News,Mango News Telugu,Telangana CS Somesh Kumar,CM KCR, KTR, Kalavakuntla Kavitha, Telanagana TRS,K Chandra Shekar Rao,Kalavakuntla Taraka Rama Rao,TRS Latest News And Updates, Bharat Rashtra Samithi,TRS Party

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పలు పథకాలలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల భాద్యత గురుతరమైనదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అన్నారు. ఇటీవల పలు జిల్లాలలో పోస్టింగ్స్ పొందిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు తమ రెండు రోజుల శిక్షణ పూర్తి అనంతరం సీఎస్ సోమేశ్ కుమార్ తో బుధవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, హరితహారం తదితర కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని, ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు కీలక పాత్ర వహించాలని కోరారు. గ్రామాల, పట్టణాల పర్యటనలకు వెళ్లే ముందు సమస్యలపై పట్టు సాధించాలని, సమస్యల పరిష్కారం దిశలో వారి పర్యటనలు ఉండాలని సీఎస్ దిశా నిర్దేశం చేశారు.

గ్రామాలు, పట్టణాలలో ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన స్థానిక పారిశుద్ధ్య, వర్క్స్ కమిటీలు, తదితర కమిటీల పనితీరు పర్యవేక్షించడానికి తరచూ కమిటీలతో సమీక్షలు జరపాలన్నారు. గ్రామాలు, పట్టణాల పారిశుధ్యం పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీలకు సమకూర్చిన మౌలిక సదుపాయాలు, ట్రాక్టర్లు, ట్రాలీలు – వాటి పనితీరు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ వినియోగము, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ తదితర పనులను పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్లకు సీఎస్ సూచించారు. బాధ్యతతో కూడిన అధికారంతో గ్రామాలు, పట్టణాలను అన్ని హంగులతో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. పనితీరు బాగాలేని స్థానిక సంస్థలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలకే పరిమితం కాకుండా పనిలో ప్రగతి చూపాలని కోరారు. స్థానిక ప్రజలతో మమేకం కావడంతోపాటు భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పంచాయితీ రాజ్ కార్యదర్శి సందీప్ సుల్తానియా, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్య నారాయణ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హనుమంతరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + eight =