రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి, జిల్లా కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం

CS Somesh Kumar held Teleconference with Collectors in the Wake of Severe Heat Wave Conditions in the State, CS Somesh Kumar held Teleconference with Collectors, Severe Heat Wave Conditions in the State, Telangana Chief Secretary, Telangana Chief Secretary Somesh Kumar, Telangana Chief Secretary Somesh Kumar held Teleconference with Collectors, CS Somesh Kumar directed that schools should be closed early, CS Somesh Kumar held a teleconference with District Collectors and senior officials of health, senior officials of health, Severe Heat Wave In Telangana, Telangana, heat wave In Telangana, severe heat wave condition In Telangana, severe heat wave conditions prevailing in the Telangana state, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నేడు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రానున్న రెండురోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో రెండు నుండి నాలుగు డిగ్రీల మేరకు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అన్ని ఆసుపత్రుల్లో వైదులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని అన్నారు.

అదేవిధంగా సరిపడా ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎండ తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య పరచాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాఠశాల సమయాన్ని మరింత తగ్గించాలని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమీషనర్ మాణిక్ రాజ్, భారత వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నలు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + eleven =