రాష్ట్రంలోని అన్ని గిరిజన గూడెంలు, తండాలకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా – సీఎస్ సోమేశ్ కుమార్

CS Somesh Kumar Says Three Phase Electricity Supplying to All Tribal Villages and Thandas in the State, CS Somesh Kumar, Three Phase Electricity Supply, Electricity Supply to All Tribal Villages, Three Phase Electricity Supply To Thandas, Mango News, Mango News Telugu, Telangana CS Somesh Kumar, Chief Secratary Somesh Kumar, CS Somesh Kumar Latest News And Updates, CS Somesh Kumar, Electricity Supply to All Tribal Villages and Thandas, 3 Phase Electricity To Tribal Villages, Telangana News And Updates

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గిరిజన గూడెంలు, తండాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసమై త్రీఫేస్ విద్యుత్ ను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు, ఆదివాసీ, గిరిజన ఆత్మీయ సభలో సీఎస్ సోమేశ్ కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 2014కు ముందు కేవలం 91 గిరిజన గురుకులాలు మాత్రమే ఉండేవని, వాటిని ప్రస్తుతం 183 కు పెంచడం జరిగిందని తెలిపారు.

వివిధ విద్య సంస్థలకు చెందిన 918 గిరిజన విద్యార్థులు జాతీయ స్థాయి ప్రముఖ సంస్థల్లో చేరారని పేర్కొన్నారు. గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధిని 2017లో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని, దీనిద్వారా గిరిజన జనాభా ప్రకారం నిధులను కేటాయిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి గిరిజన గూడాన్ని, తండాను గ్రామ పంచాయతీగా మార్చామని, దీనిలో భాగంగా రాష్ట్రంలో 2471 కొత్త గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేశామని సీఎస్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + ten =