మంచి నీళ్లను కాదు.. రోగాలను కొని తెచ్చుకుంటున్నారట..

Do you drink water from water cans,Do you drink water,water from water cans,Mango News,Mango News Telugu,Mineral water in tins, drink water from water cans, water cans, good water, diseases, Degradation,Greenhouse,Are packaged drinking water cans safe,Stop Drinking Bottled Water,Canned water can give you cancer,Mineral water in tins Latest News,Mineral water in tins Latest Updates,Mineral water in tins Live News,Water cans Latest News,Water cans Latest Updates
Mineral water in tins, drink water from water cans, water cans, good water, diseases, Degradation,Greenhouse

ఇప్పుడు ఎవరింట్లో చూసినా టిన్స్‌లో మినరల్ వాటర్ కొనుక్కునే తాగుతున్నారు. ఒకప్పటిలా నల్లా నీళ్లు తాగే రోజులు పోయాయి. చివరకు పల్లెటూరిలో కూడా వాటర్ బాటిల్స్ కొనుక్కునే తాగుతున్న సీన్లే కనిపిస్తున్నాయి. ట్యాప్ వాటర్ పట్టుకుని బిందెలో నీళ్లు తాగే రోజుల నుంచి .. వాటర్ బాటిల్స్ కొనుక్కుని తాగుతున్న స్థాయికి వెళుతున్నామని భావిస్తున్నారు. అంతే తప్ప ఆధునికత పేరుతో రోగాలను కూడా కొని తెచ్చుకుంటున్నామన్న విషయాన్ని మరిచిపోతున్నారు.

సిటీల్లో తప్పని సరి పరిస్థితుల్లో బాటిల్ వాటర్స్ తాగుతుంటే.. పల్లెటూళ్లలో సిటీ పోకడలు అరువు తెచ్చుకుని మరీ ఈ నీళ్లనే తాగుతున్నవాళ్లు ఎక్కువ అవుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నకంపెనీలు 20 లీటర్ల వాటర్ బాటిల్ 20 రూపాయలకు, 30 రూపాయలకు అందిస్తుంటే.. బిస్లెరీ వంటి కంపెనీలు రూ. 80 నుంచి వంద రూపాయలకు ఈ బాటిల్స్‌ను సరఫరా చేస్తున్నాయి. అయితే ఇలా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటర్ క్యాన్‌ల నుంచి ఈ నీటిని తాగడం వల్ల దీర్ఘకాలంలో అనారోగ్యం పాలవడమే కాకుండా ఆ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం కూడా చాలా విషపూరితంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

ప్లాస్టిక్ దాని త్వరగా భూమిలో కలిసిపోయే లక్షణాలు లేకపోవడం వల్ల అది విచ్ఛిన్నం కాకుండా పర్యావరణంలోనే కొన్నేళ్ల పాటు ఉండిపోతుంది. ఈ వాటర్ టిన్‌లను పడేసినప్పుడు వాటివల్ల పల్లపు ప్రదేశాలు, జల జీవావరణ వ్యవస్థలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటాయి. దీని వల్ల వన్యప్రాణులు, సహజ సమతుల్యతకు ముప్పు ఏర్పడుతుంది. అంతేకాదు ఈ ప్లాస్టిక్ ఉత్పత్తి వల్ల గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేయడంతో పాటు..వేగంగా వాతావరణ మార్పులు జరిగేలా చేస్తుంది.

మానవ ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పుగా ప్లాస్టిక్ గురించి చెబుతుంటారు పర్యావరణ వేత్తలు. ఎందుకంటే..ప్లాస్టిక్ బాటిల్‌లో ఉంచిన నీళ్లను తాగడం వల్ల .. ప్లాస్టిక్‌లో ఉన్న రసాయనాలు మెల్లమెల్లగా నీటిలోకి చేరి.. అవి మన రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఈ వాటర్ టిన్స్ భారీ మొత్తంలో వెహికల్స్‌లో తీసుకువస్తున్నప్పుడు ఎండ వేడికి ఈ ప్లాస్టిక్‌లోని రసాయనాలు నీటిలో ఎక్కువ శాతంలో కలిసిపోతాయి. ఈ వాటర్ క్యాన్‌లలో నీళ్లను ఉపయోగించడంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా క్యాన్సర్, జీర్ణ సమస్యలు, హార్మోన్ అసమతుల్యత, పీసీఓడీ ప్రమాదాలను పెంచుతుంది.

అంతేకాదు ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌ల నుంచి మంచినీళ్లు తాగడం వల్ల .. రోగనిరోధక వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుంది. ఎలా అంటే..నీటి ద్వారా ప్లాస్టిక్‌లోని రసాయనాలు మనం తీసుకోవడం వల్ల.. శరీరం రోగనిరోధక చర్యలకు భంగం కలుగుతుందన్నమాట. అలాగే ప్లాస్టిక్ వాటర్ టిన్‌లను ఎండలో ఎక్కువసేపు ఉంచడం వల్ల డయాక్సిన్ అనే హానికరమైన టాక్సిన్ విడుదల అవుతుంది. దీని వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

మరోవైపు ప్లాస్టిక్ వాటర్ టిన్‌లలో థాలేట్స్ అనే రసాయనం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాంటి ప్లాస్టిక్ బాటిల్‌లో నిల్వ ఉంచిన నీటిని తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్ ప్రమాదంతో పాటు మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందట. రక్తప్రవాహంలోకి ప్రవేశించగల బీపీఏ వంటి పదార్థాలు..మన శరీరంలోని కణాలకు హాని కలిగిస్తాయి. అందుకే నల్లా నీళ్లనే కాచి మరగబెట్టుకుని తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ వాటర్ క్యాన్స్‌లో ఉండే నీళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉండొచ్చని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + eleven =