ఆ మూవీ హిట్ అయితే మహేశ్ బాబు స్టార్ హీరో అయ్యేవారు కాదా?

What did Krishna Say After Watching the Movie Nani,What did Krishna Say,After Watching the Movie Nani,Guntur Karam Movie, hit movie, krishna, Mahesh Babu, Mahesh Babu star hero, Movie, Nani movie, SSMB29,Mahesh Babu Nani Movie,Krishna Say the Movie Nani,SSMB29 Latest News,SSMB29 Latest Updates,Guntur Karam Movie Latest Updates,Superstar Krishna,Superstar Krishna on Movie Nani,Movie Nani Latest News
Mahesh Babu, Krishna, Nani movie, movie, hit movie, Mahesh Babu star hero,Guntur Karam Movie, SSMB29,

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగానే బాల నటుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన మహేశ్ బాబు ఇప్పుడు ఎంతోమంది యువతుల కలల రాకుమారుడు అయిపోయాడు. 47 ఏళ్ల వయసులోనూ  పాతికేళ్ల యువహీరోగా కనిపిస్తూ ఫిట్‌నెస్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు . రాజాకుమారుడు మూవీతో హీరోగా తెరంగేట్రం చేసిన మహేశ్ బాబు.. తన సొంత ఇమేజ్‌తో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. అయితే ఎవరికైనా తన కెరీర్‌ను  చేంజ్ చేయడానికి ఒక్క సినిమా చాలు.

చిరంజీవికి ఒక ఖైదీ, నాగార్జునకు శివ వంటి సినిమాలు ఎలాంటి బ్రేక్ ఇచ్చిందో ప్రతీ హీరోకు కూడా అలా బ్రేక్ ఇచ్చిన సినిమాలు ఉంటూనే ఉంటాయి.  అయితే  ఒక సినిమా హిట్ అవడం స్టార్ హీరోను చేసినట్టే , ఒక సినిమా ప్లాప్ అవడం కూడా స్టార్ హీరోను చేస్తుందన్న విషయాన్ని మాత్రం సూపర్ స్టార్ కృష్ణ మహేశ్ బాబు విషయంలో చెప్పారన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

సాధారణంగా సినిమాలు హిట్ అయితేనే  స్టార్ హీరోలుగా గుర్తించబడతారు. కానీ, మహేశ్ బాబు చేసిన నాని సినిమా గనుక హిట్ అయితే.. భవిష్యత్తులో మహేశ్ బాబు స్టార్ హీరో అవలేడని సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో అన్నారట. తండ్రి తన కొడుకు విషయంలో ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చారేంటి అని చాలామంది అనుకున్నారట కూడా. అయితే మహేశ్ బాబు.. తన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా తన కథలను తానే సెలెక్ట్ చేసుకునేవారట. ఎప్పుడూ కూడా కృష్ణ కథలు వినడంలో ఆసక్తి చూపించేవారు కాదట కానీ.. సినిమా ప్రివ్యూకు మాత్రం వెళ్లేవారట.

అలా మహేశ్ బాబు నాని సినిమా చూసిన కృష్ణ.. ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఇక మహేశ్ స్టార్ అయ్యే ఛాన్స్ పోగొట్టుకునట్లేనని అన్నారట. అది విన్న మహేశ్ బాబు, మూవీ యూనిట్ కృష్ణ అలా అనేశారేంటని అనుకున్నారట. నాని సినిమాకు ఎస్‌జే సూర్య డైరక్షన్ చేయగా.. ఇందులో బాలీవుడ్  బ్యూటి అమీషా పటేల్ హీరోయిన్‌గా నటించింది. ఇందులో మహేశ్ బాబు పగలు ఎనిమిదేళ్ల అబ్బాయిగా.. రాత్రి 28 ఏళ్ల యువకుడిగా నటించాడు.

అయితే ఈ సినిమా  కృష్ణ చెప్పినట్లు ప్లాప్ అయింది.  ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత.. ఒక స్టార్ హీరో ఇలాంటి సినిమాలు చేయడాన్ని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఒకవేళ కానీ ఫ్యాన్స్ ఈ సినిమాను హిట్ చేసి ఉంటే .. ఆ హీరో నుంచి  అలాంటి సినిమాలే కోరుకునేవారు. అలాంటి మూవీలు చేసి స్టార్ హీరో రేంజ్‌కు ఎదగడం చాలా కష్టమని, సినిమా చూసిన వెంటనే కృష్ణ అందుకే ఆ  మాట అన్నారని మిగిలిన వాళ్లకు తర్వాత అర్థమైందట. అప్పటి నుంచే మహేశ్ బాబు కథలు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టారట.

మరోవైపు  తివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబినేషన్‍లో రాబోతున్న మూడో సినిమా గుంటూరు కారంపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందని, త్వరలోనే  ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. అలాగే  రాజమౌళి డైరక్షన్లో యాక్షన్ అండ్వెంచరస్ సినిమాగా SSMB29 కూడా మహేశ్ బాబు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికోసమే మహేశ్ బాబు ఎప్పుడూ చేయని వర్కౌట్స్ చేస్తున్న వీడియో ..తాజాగా సోషల్ మీడియాలో వైరల్  అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =