ఇంధనం లేదంటూ విమానాలను నిలిపివేసిన పాకిస్తాన్

Pakistan has Stopped Flights Due to Lack of Fuel,Pakistan has Stopped Flights,Flights Due to Lack of Fuel,Stopped Flights Due to Fuel,Mango News,Mango News Telugu,Pakistan International Airlines,Lack of funds to pay for fuel,Pakistan Airlines Cancels 48 Flights,Pakistan Fuel Crisis Deepens,14 PIA flights cancelled,non payment of dues to fuel supplier,lack of fuel, Pakistan has stopped flights, Pakistan International Airlines, PIA, Pity the situation in Pakistan, PSO,Pakistan Flights Latest News,Pakistan Flights Latest Updates,Pakistan Flights Live News
PSO,PIA, Pakistan International Airlines,Pity the situation in Pakistan, Pakistan has stopped flights, lack of fuel

కొన్ని నెలలుగా పాకిస్తాన్ ర్థిక పరిస్థితి దిగజారిపోతున్న కథనాలు వినిపిస్తున్నాయి. పేదల పరిస్థితి మరింత భయంకరంగా మారిందని.. చివరకు పక్క దేశాలకు వెళ్లి అడుక్కుని తినడానికి కూడా సిద్ధం అయిపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సౌదీ వంటి దేశాలు పాకిస్తాన్‌కు తమ దేశాలకు జేబు దొంగలను, బెగ్గర్స్‌ను పంపొద్దని వార్నింగ్ కూడా ఇచ్చాయి.

ఆర్థిక సంక్షోభంతో జనానికి పాకిస్తాన్‌లో తిండి కూడా దొరకని పరిస్థితి కొన్నాళ్లుగా నెలకొంది. లీటర్ పెట్రోల్ ధర 350 రూపాయలకు చేరుకోగా..కిలో బియ్యం వంద రూపాయలు పెట్టి కొనాల్సి వస్తోంది. ఇలా నిత్యావసర ధరలన్నీ ఆకాశాన్ని అంటాయి. విదేశీ మారక నిల్వలు దాదాపు తగ్గిపోవటంతో.. చివరకు విమానాలను కూడా నిలిపివేసే సిచ్యువేషన్లో పడింది పాక్. విమానాలకు అవసరమయిన వైట్ పెట్రోల్ కొనుగోలుకు నగదు లేకపోవడంతో.. ఏకంగా 48 ఇంటర్నేషనల్ సర్వీసులను రద్దు చేసింది..

అక్టోబర్ 18కి షెడ్యూల్ చేసిన 16అంతర్జాతీయ, 8 దేశీయ విమానాలు పీఎస్ఓ నుంచి ఇంధన సరఫరా కారణంగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో క్యాన్సిల్ చేసిన విమానాల ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానాలకు మార్చారు. ఈ నిర్ణయాన్ని అనుసరించి వారి విమానానికి సంబంధించిన వివరాల కోసం PIA కస్టమర్ కేర్, PIA కార్యాలయాలు లేదా వారి ట్రావెల్ ఏజెంట్‌ను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని పీఎస్‌ఓ అంటే పాకిస్తాన్ స్టేట్ ఆయిల్..చెల్లించని బకాయిల వల్ల సరఫరా నిలిచిపోయింది. దీని వల్ల పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌.. విమానాలకు భారీగా ఇంధన కొరత ఏర్పడింది. పేరుకుపోయిన అప్పుల వల్ల ఇప్పటికే పతనం అంచున నిలబడంతో పాటు.. ప్రైవేటీకరణ దిశగా మంతనాలు జరుపుతున్న ఎయిర్‌లైన్స్‌ సంస్థ భవిష్యత్తు ఇప్పుడు ఏకంగా అంధకారంలో పడినట్లు అయింది. జాతీయ ఎయిర్‌లైన్స్ సంస్థ నిర్వహణ ఖర్చులను కోరుతుండగా..వాటికి మద్దతుగా రూ. 23 బిలియన్లను అందించడానికి పాక్ ప్రభుత్వం నిరాకరించడంతో ఈ పరిస్థితి మరింత తీవ్రమైనట్టుగా తెలుస్తోంది.

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు పాకిస్తాన్ స్టేట్ ఆయిల్ నుంచి ఇంధనం కోసం.. రోజుకు రూ. 100 మిలియన్లు అవసరమవుతాయి. అయితే పాకిస్తాన్ స్టేట్ ఆయిల్ ముందస్తు డబ్బుల చెల్లింపులను మాత్రమే డిమాండ్ చేయడంతో, ఎయిర్‌లైన్ ఈ అవసరాన్ని తీర్చలేకపోయింది. ఇది ఇప్పటితో అయిపోదని.. భవిష్యత్తులో మరిన్ని విమాన రద్దులకు దారి తీసే పరిస్థితులు తలెత్తుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రాజకీయ అస్థిరతతో పాటు మన దాయాది దేశం.. తన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే ఇలాంటి సమయంలో..48 ఇంటర్నేషనల్ సర్వీసుల రద్దు పరిణామం పాకిస్తాన్‌ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో ఏకంగా 21.3 శాతానికి చేరుకుంది. గత ఏడాది కాలంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే.. ప్రస్తుతం పాకిస్థాన్ రూపాయి విలువ దాదాపు సగానికి సగం పడిపోయింది. పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు..సుమారు 10 బిలియన్ డాలర్ల వద్ద అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =