హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

TRS MLC Kalvakuntla Kavitha Visits 35th National Book Fair in Hyderabad,TRS MLC Kalvakuntla Kavitha,Kavitha Visits 35th National Book Fair,Hyderabad Book Fair,NTR Stadium,Mango News,Mango News Telugu,Minister Srinivas Goud On Hyderabad Book Fair,Book Fair Hyderabad,NTR Stadium Book Fair,Book Fair Hyd,Hyd Book Fair,Book Fair NTR Stadium,NTR Stadium Book Fair,Srinivas Goud On Book Fair,Book Fair NTR Stadium Hyderabad,Book Fair NTR Stadium Hyd,Hyderabad Latest News and Updates,NTR Stadium Hyd News and Live Updates

నగరంలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్) స్టేడియంలో డిసెంబర్ 22 నుంచి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌/35వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ బుక్ ఫెయిర్‌ జనవరి 1వ తేదీ వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఎన్టీఆర్​ స్టేడియంలో నిర్వహిస్తున్న బుక్ ఫెయిర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్ లో అలిశెట్టి ప్రభాకర్‌ వేదికపై ‘వల్లంకి తాళం’ పుస్తకంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌, పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ పాల్గొన్నారు. ‘వల్లంకి తాళం’ కవితా సంపుటిని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించగా, ఆ పుస్తకానికి 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యానికి ఎనలేని చరిత్ర ఉందన్నారు. తెలంగాణకు చెందిన అనేక మంది కవులు, రచయతలు తరాలకు గుర్తుండిపోయేలా రచనలు చేశారని అన్నారు. మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ సురవరం ప్రతాపరెడ్డికి వచ్చిందని, ఆ పరంపర కొనసాగుతూనే ఉందని అన్నారు. గోరటి వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటిని ఎమ్మెల్సీ కవిత కొనియాడుతూ, ఆయన రచనల్లో మట్టితత్వం అణువణువునా ఉంటుందన్నారు. మరోవైపు బుక్ ఫెయిర్ లో ఎమ్మెల్సీ కవిత కలియదిరుగుతూ, బుక్ స్టాల్స్‌ను ఆసక్తిగా తిలకించారు. అక్కడ తెలంగాణ జాగృతి స్టాల్‌ ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పలు పుస్తకాలను కొనుగొలు చేశారు. ఈ సందర్శనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ “ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన 35వ జాతీయ పుస్తక ప్రదర్శనలో జరిగిన చర్చా కార్యక్రమంలో సాహిత్య రంగంలోని గౌరవ సభ్యులతో కలిసి పాల్గొన్నాను. అన్ని స్టాల్స్‌ను సందర్శించడం ఖచ్చితంగా ఈ బుక్ ఫెయిర్ సందర్శనలో హైలైట్” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 11 =