ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2021

2021 Sahitya Akademi Award, Famous Poet, Famous Poet Goreti Venkanna, Goreti Venkanna, Goreti Venkanna Sahitya Akademi Award, Goreti Venkanna Wins Sahitya Akademi Award, Goreti Venkanna Wins Sahitya Akademi Award-2021, Mango News, MLC Goreti Venkanna Wins Sahitya Akademi Award, MLC Goreti Venkanna Wins Sahitya Akademi Award-2021, Sahitya Akademi Award, Sahitya Akademi Award 2021

కేంద్ర సాహిత్య అకాడమీ గురువారం నాడు 2021 సంవత్సరానికి గానూ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు- 2021 దక్కింది. ముందుగా సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబర్‌ అధ్యక్షతన డిసెంబర్ 30, గురువారం నాడు సమావేశమైన అవార్డుల కమిటీ మొత్తం 20 భాషలకు సంబంధించిన రచయితలను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఏడు కవితల పుస్తకాలు, రెండు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలుతో పాటు ఒక్కో ఆత్మకథ, జీవిత చరిత్ర, విమర్శ మరియు పురాణ కవిత్వం 2021 సాహిత్య అకాడమీ అవార్డులను గెలుచుకున్నాయి.

ఇందులో గోరటి వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో పుట్టిన గోరటి వెంకన్న ఎన్నో పల్లె పాటలతో ప్రజలను అలరించారు. అచ్చ పల్లె పదాలతో పుస్తకాలు రచించి, ప్రజలను చైతన్యపరిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక కవిగా ఆయన తనదైన పాత్ర పోశించారు. సాహిత్య అకాడమీ అవార్డు కింద పతకం, శాలువాతో పాటు లక్ష రూపాయల నగదును బహుమతిగా అందిస్తారు. త్వరలో న్యూఢిల్లీలో జరిగే ప్రత్యేకమైన సాహిత్య ఉత్సవంలో ఈ అవార్డులను అందజేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =