15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో మంత్రి హరీశ్‌రావు భేటీ

Finance Minister Harish Rao Meets 15th Finance Commission Chairman,Mango News, Political Updates 2020, Telangana Breaking News,Telangana Political Updates,Finance Minister Harish Rao News,15th Finance Commission Chairman,Minister Harish Rao Budget Meeting
15వ ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ తో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు జనవరి 28, మంగళవారం నాడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్రం నుండి నిధుల శాతం పెంపు, ఋణపరిమితి పెంపు, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇవ్వాలని ఆర్థిక సంఘం చైర్మన్ ను మంత్రి హరీష్ రావు కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథకు నిర్వహణ కోసం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ భగీరథ ప్రాజెక్టుకు 19వేల కోట్లు కేంద్రం ఇచ్చేలా చూడాలని 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పలు అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రాసిన లేఖను చైర్మన్ నందకిశోర్ సింగ్ కు మంత్రి హరీష్ రావు అందజేశారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 12 =