కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స, స్టంట్ వేసిన వైద్యులు

Former Minister and T-Congress Senior Leader Jana Reddy Admitted To Hospital Due To Illness,Former Minister and T-Congress Senior Leader,Senior Leader Jana Reddy,Jana Reddy Admitted To Hospital,Jana Reddy Admitted Due To Illness,Mango News,Mango News Telugu,Jana in Hospital,TRS Leaders form a queue,Kunduru Jana Reddy,Congress Leader Jana Reddy Political History,Senior Leader Jana Reddy Latest News,Senior Leader Jana Reddy Latest Updates,Senior Leader Jana Reddy Live News

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం (ఏప్రిల్ 11, 2023) రాత్రి మోకాలి చికిత్స కోసం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో జానారెడ్డిని పూర్తి చెకప్ చేసిన డాక్టర్లు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి గుండె రక్తనాళం ఒకటి పూడుకుపోయినట్టుగా వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే డాక్టర్లు, విషయాన్ని ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసి అత్యవసరంగా శస్త్ర చికిత్స నిర్వహించి స్టంట్ వేశారు. కాగా ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, మరికొన్ని రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

కాగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయమై ఇటీవల హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో జానారెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే. 76 సంవత్సరాల జానారెడ్డి.. తెలంగాణలో మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ నేతగా గుర్తింపు పొందారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. ఇక 2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుండి పోటీ చేసిన జానారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నరసింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న ఆయన, అన్ని పార్టీల అధినేతలు, నేతలతో స్నేహపూర్వకంగా మెలుగుతుంటారు. దీంతో జానారెడ్డి ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న పలువురు పార్టీ నేతలు, ఇతర పార్టీల ప్రముఖులు ఆయన కుటుంబానికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే జానారెడ్డి త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =