లెజండరీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్ కోబ్‌ బ్రయంట్‌ మృతి

Basketball Player Kobe Bryant, Latest Breaking News 2020, Los Angeles Lakers legend Kobe Bryant, Mango News, NBA legend Kobe Bryant Daughter, NBA Legend Kobe Bryant Dies, NBA Legend Kobe Bryant Dies In A Helicopter Crash, NBA Superstar Kobe Bryant News
లెజండరీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ కోబ్‌ బ్రయంట్‌ జనవరి 26, ఆదివారం నాడు హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందారు. కాలిఫోర్నియాలోని కాలాబాసాస్లో హెలికాఫ్టర్‌ కూలిన ఘటనలో కోబ్‌ బ్రయంట్‌, ఆయన కుమార్తె జియానాతో సహా మరో ఏడుగురు మృతి చెందినట్టుగా అధికారులు ప్రకటించారు. కోబ్ మృతితో క్రీడా ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కోబ్ మరణావార్త విని అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. లాస్ ఏంజిల్స్ లేకర్స్‌ తరపున ఐదు ఎన్‌బిఎ ఛాంపియన్‌షిప్‌లను కోబ్‌ బ్రయంట్‌ గెలుచుకున్నాడు. 2008, 2012లో అమెరికా తరఫున రెండు సార్లు ఒలింపిక్‌ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఎన్నోసార్లు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ గా నిలవడంతో పాటు, బాస్కెట్‌బాల్‌ చరిత్రలో బ్రయంట్‌ ఎన్నో రికార్డులు సృష్టించాడు. 20 సంవత్సరాలు పాటు బాస్కెట్‌బాల్‌ ఆటగాడిగా అత్యంత పేరు ప్రఖ్యాతలు సంపాదించి 2016 లో కోబ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కోబ్‌ బ్రయంట్‌ అకాల మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాలు విచారం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రీడాకారులు, సెలెబ్రిటీలు కోబ్‌ బ్రయంట్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here