కల్నల్ సంతోష్ బాబు మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి, అండగా ఉంటామని హామీ

#KCR, 3 Indian Soldiers Killed, China kills three Indian soldiers, Col Bikkumalla Santosh Babu, Col Santosh Babu, Colonel Santosh Babu, colonel santosh babu bihar regiment, India China border clash, KCR has Expressed Shock over the Martyrdom of Col Santosh Babu, Martyrdom of Col Bikkumalla Santosh Babu, Telangana CM KCR

భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జూన్ 15/16 న జరిగిన తీవ్ర ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘర్షణలో తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు కూడా అమరుడయ్యారు. ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గత ఏడాదిన్నరగా ‌సంతోష్‌ బాబు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది.

భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం ప్రకటించారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు, అంత్యక్రియల వరకు ప్రతీ కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీష్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =