వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కీలక సమీక్ష, వారికీ ఉచితంగా డయాలసిస్ సేవలు

Free Dialysis, Free Dialysis Centers, Free Dialysis Centers in Hyderabad, Free Dialysis Centers in Telangana, Free dialysis centres for HIV patients, Free Dialysis to HIV/Aids & Hepatitis Patients, Harish Rao Directed Officials to Launch Free Dialysis Centers, Health Minister Harish Rao, Health Minister Harish Rao Directed Officials to Launch Free Dialysis Centers in Hyderabad, Health Minister Harish Rao Directed Officials to Launch Free Dialysis Centers in Hyderabad Warangal, Hyderabad, Mango News, Telangana to launch free dilaysis services, Telangana to launch free dilaysis services to HIV/AIDS, Two dialysis centres for AIDS Hepatitis patients

తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కేర్ ఆసుపత్రిలో‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కిడ్నీ వ్యాధి గ్రస్థులైన ఏయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించాలని చెప్పారు ఇందుకోసం హైదరాబాద్ లో ఒక కిడ్నీ డయాలసిస్ కేంద్రం, వరంగల్ లో మరో కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ రెండు కేంద్రాల్లో ఐదు బెడ్లు ఎయిడ్స్‌ పేషంట్లకు, మరో ఐదు బెడ్లు హెపటైటిస్ పేషంట్లకు కేటాయించి‌ డయాలసిస్ సేవలు అందించాలన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు డయాలిసిస్ చేయించకోవడం ఆర్థికంగా చాలా భారంగా మారిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారని చెప్పారు.

ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో 43 డయాలిసిస్ కేంద్రాలు నడుస్తుండగా, వీటి ద్వారా 10 వేల మంది రోగులకు డయాలిసిస్ సేవలు అందుతున్నాయని, సంవత్సరానికి ఇందు కోసం 100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో కిడ్నీ వ్యాధితో బాదపడే ఎయిడ్స్, హెపటైటిస్ పేషంట్లకు సైతం సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు డయాలసిస్‌ సేవలు ఉచితంగా అందించాలి. పేషంట్ల సంఖ్యకు తగినట్టుగా డయాలిసిస్ మెషీన్లను ఏర్పాట్లను చేసి, వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం, ఇకముందు నుండి ఎయిడ్స్, హెపటైటిస్ వ్యాధి గ్రస్తులకు డయాలిసిస్ కేంద్రాలను యుద్దప్రాతిపదిన ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్ కంట్రోల్‌ డైరెక్టర్ ప్రీతీ మీనా, ఓఎస్డీ‌ డాక్టర్ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి‌ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 11 =