గతంలో రూ.400 ఉండే గ్యాస్‌ ధర నేడు రూ.1,100 దాటింది, ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే – మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Participates in BRS Protest at Ghatkesar Today Against LPG Cylinder Price Hike by Centre,Minister Harish Rao Participation,Harish Rao Participates in BRS Protest,BRS Protest at Ghatkesar Today,BRS Protest Against LPG Cylinder Price,LPG Cylinder Price Hike by Centre,Mango News,Mango News Telugu,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Brs Protest Ghatkesar Today,Brs Protest Ghatkesar Hyderabad,Brs Protest Ghatkesar Telangana,Ghatkesar Latest News Today

డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను మరోసారి రూ.50 పెంచాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురు, శుక్రవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) నిర్ణయించింది. కాగా డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.50 పెంచగా, కమర్షియల్ సిలిండర్ ధర రూ.350 పెరిగింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ బుధవారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఘట్‌కేసర్‌లో భారీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డిలు పాల్గొని మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గృహావసరాల సీలిండర్ ధర రూ.400 ఉండేదని, అయితే కేంద్రం అడ్డగోలుగా పెంపులతో అది ఇప్పుడు రూ.1,100 పైగా పెరిగిందని మండిపడ్డారు. ఇది ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వ వైఫల్యమేనని, అన్ని వర్గాలను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. 2014కి ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో గ్యాస్‌పై ప్రభుత్వం రూ.2.14 లక్షల కోట్ల సబ్సిడీ అందించేది, కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ దానిని పూర్తిగా ఎత్తివేసిందని విమర్శించారు. ఎన్నికలు వస్తే గ్యాస్‌పై 10 పైసలు తగ్గిస్తారని, పూర్తవగానే రూ.100 పెంచుతారని, ఎన్నికల తర్వాత గ్యాస్‌ ధరలు పెంచడం బీజేపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు ప్రధాని మోదీ పంచిపెడుతున్నారని, సామాన్య జనంపై మాత్రం ధరల పెంపు విధిస్తున్నారని విమర్శించారు. పెంచిన రేట్లను తగ్గించుకుంటే త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, కేంద్రం మెడలు వంచుతామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 16 =