సీఎం కేసీఆర్ తో తెలంగాణలో వైద్య విద్య విప్లవం, 9 మెడికల్ కాలేజీలపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష

Health Minister Harish Rao Held Review On 9 New Medical Colleges To Be Established This Year,Health Minister Harish Rao,Harish Rao Held Review On 9 New Medical Colleges,Medical Colleges To Be Established This Year,Mango News,Mango News Telugu,Expedite Works Of Nine New Medical Colleges,9 Medical Colleges In Telangana To Enrol Students,Health Minister Harish Rao Latest News,New Medical Colleges 2023,Telangana News,Telangana New Medical Colleges News Today,Telangana Latest News And Updates

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌ రావు ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్ కాలేజీలపై నిమ్స్ ఆసుపత్రి నుండి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ వల్ల తెలంగాణ వైద్య విప్లవం దిశగా అడుగులు వేస్తున్నదని అన్నారు. మారుమూల జిల్లాకు సైతం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ సీట్లలో ఇప్పటికే తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందని చెప్పారు. తెలంగాణ ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు, 7 పీజీ సీట్లు ఉన్నాయన్నారు. ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలతో సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. కేంద్రం ఒక్క కాలేజీ ఇవ్వకున్నా, సొంత నిధులతో స్వరాష్ట్రంలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు.

9 కొత్త మెడికల్ కాలేజీల పనులు వేగంగా పూర్తి చేసి, ఆ కాలేజీల్లో ఈ ఏడాది తరగతులు ప్రారంభించే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో నిమ్స్ నుండి మంత్రి హరీశ్ రావుతో పాటుగా మంత్రి సత్యవతి రాథోడ్, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ పాల్గొనగా, జిల్లాల నుంచి పలువురు రాష్ట్ర మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =