వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు స్వల్ప విరామం, మే 28న సత్తుపల్లి నుంచి పునఃప్రారంభం

Short Break for YS Sharmila's Praja Prasthanam Padayatra will Resume from Sathupally on May 28, YS Sharmila's Praja Prasthanam Padayatra will Resume from Sathupally on May 28, Short Break for YS Sharmila's Praja Prasthanam Padayatra, Praja Prasthanam Padayatra will Resume from Sathupally on May 28, Sharmila Takes A Break To Praja Prasthanam Padayatra, Small Break To Praja Prasthanam Padayatra, YS Sharmila's Praja Prasthanam Padayatra, Praja Prasthanam Padayatra will Resume from Sathupally, YS Sharmila, Praja Prasthanam Padayatra, Praja Prasthanam Padayatra News, Praja Prasthanam Padayatra Latest News, Praja Prasthanam Padayatra Latest Updates, Praja Prasthanam Padayatra Live Updates, Mango News, Mango News Telugu,

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్ర‌జా ప్ర‌స్థానం’ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర విషయంలో రైతుల పక్షాన పోరాటం చేసే నేపథ్యంలో ఈ ప్రజాప్రస్థానం పాదయాత్రకు స్వల్ప విరామం ఇస్తున్నట్టు తాజాగా వైఎస్ షర్మిల ప్రకటించారు. మే 28వ తేదీ నుంచి తిరిగి సత్తుపల్లి నుంచే పాదయాత్ర పునఃప్రారంభమవుతుందని తెలిపారు. ముందుగా గతఏడాది అక్టోబరు 20న చేవెళ్ళ నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, కరోనా మహమ్మారి నేపథ్యంలో నవంబర్ 9,2021 నుంచి మార్చి 10, 2022 వరకు పాదయాత్రకు విరామం ప్రకటించారు. అనంతరం మార్చి 11న నల్గొండ జిల్లా నార్కెట్ ప‌ల్లి మండ‌లంలోని కొండ‌పాక‌గూడెం గ్రామం నుంచి తన ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్రను వైఎస్ షర్మిల పునఃప్రారంభించారు. ఇప్పటికి ఈ పాదయాత్ర 76 రోజుల పాటుగా విజయవంతంగా సాగింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర, నల్గొండ జిల్లా మీదుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వద్ద 76వ రోజు వాయిదా పడింది. సత్తుపల్లి నియోజకవర్గం తాళ్లమడ గ్రామంలో వైఎస్ షర్మిల పాదయాత్ర 1000 కిమీ మైలురాయి దాటగా, సత్తుపల్లి టౌన్ లో బహిరంగసభను నిర్వహించిన ఆమె మే 5న 1006 కిమీల ప్రజాప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నారు. వరి రైతుల పక్షాన నిలబడేందుకు పాదయాత్రను వాయిదా వేస్తున్నామని, తిరిగి ఈ నెల 28న సత్తుపల్లి నైట్ హల్ట్ క్యాంపు నుంచే పాదయాత్రను పునఃప్రారంభించనున్నట్టు వైఎస్ షర్మిల తెలిపారు.

ప్రస్తుతం మద్ధతుధరపై రైతుల కష్టాలను చూసేందుకు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన చేస్తున్నారని, ఇప్పటికే సూర్యాపేట, మెదక్ మార్కెట్ యార్డ్ లను సందర్శించారని తెలిపారు. మద్దతు ధర చెల్లించడంతో పాటు 20శాతం బోనస్ ఇవ్వాలని, యాసంగి లో వరి వేయని రైతులకు ఎకరాకి 25వేలు నష్ట పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =