న్యూడెమోక్రసీ సభ్యుడు లింగన్న రీ పోస్టుమార్టం పూర్తి

breaking news, High Court, High Court Directs Re-Postmortem Of Linganna, latest news, Linganna, Linganna naxal killed in encounter, Mango News Telugu, naxal, naxal killed in encounter, naxal linganna, Re-Postmortem Of Linganna, re-postmortem of naxal killed in encounter, Telangana HC directs re-postmortem of naxal killed in encounter

హైకోర్టు ఆదేశాల మేరకు న్యూడెమోక్రసీ దళ సభ్యుడు లింగన్న మృత దేహానికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు కొత్తగూడెం నుండి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి లింగన్న మృత దేహాన్ని తరలించారు. గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సీనియర్ వైద్యులు లింగన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం పక్రియను అధికారులు వీడియో తీసారు,అనంతరం మృతదేహాన్ని భారీ భద్రత మధ్య కుటుంబ సభ్యులకు అందజేసారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జూలై 31న జరిగిన ఎన్‌కౌంటర్‌ లో లింగన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ప్రజల కోసం పోరాడిన లింగన్నను బూటకపు ఎన్‌కౌంటర్‌ చేసారని కుటుంబ సభ్యులు, పలు ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌర హక్కుల సంఘం స్పందించి హైకోర్టును ఆశ్రయించడంతో, కోర్టు విచారణ చేపట్టింది. రీ పోస్టుమార్టం నిర్వహించి, పోస్టుమార్టం రిపోర్టును ఈ నెల 5వ తేదీలోగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గాంధీ ఆసుపత్రిలో రీపోస్టుమార్టం జరగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది, లింగన్న కుటుంబసభ్యులును కలవడానికి వచ్చిన ఇతర ప్రజా సంఘాలు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. లింగన్న కుమారుడు హరి మాట్లాడుతూ తన తండ్రిని అన్యాయంగా చంపారని, కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం లేకుండానే కొత్తగూడెంలో మొదట పోస్టుమార్టం నిర్వహించారని చెప్పాడు. ఆగస్టు 5వ తేదీన అధికారులు లింగన్న రీ పోస్టుమార్టం రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించనున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=YWih3AUyRgs]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − eight =