నరేంద్రమోదీని కలిసిన మోహన్‌బాబు

Actor Mohan Babu Latest News, Andhra Pradesh Latest News, AP Breaking News, Mango News Telugu, Mohan Babu Family Meets PM Modi, Mohan Babu Meets PM Narendra Modi In Delhi, Political Updates 2020, Prime Minister Narendra Modi, Telangana Breaking News
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు జనవరి 6, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మోహన్‌బాబుతో పాటుగా కుమారుడు విష్ణు, కోడలు విరోనిక, కుమార్తె మంచు లక్ష్మీలు ఉన్నారు. దాదాపు 45 నిమిషాల పాటూ సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీలో చేరాల్సిందిగా మోహన్ బాబును ప్రధాని మోదీ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. మోహన్‌బాబు కుటుంబ సమేతంగా వెళ్లి మోదీతో భేటీ అవ్వడంపై రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే చేరిక విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్‌ షాతో కూడా మోహన్ బాబు సమావేశం కానున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ యేనా, ఏదైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా అన్న విషయం తేలాలంటే మరికొద్దిరోజుల్లో ఆగాల్సిందే.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + nine =