భారీగా పెరిగిన ఆదాయపు పన్ను చెల్లించేవారి సంఖ్య..!

The Number of Income Tax Payers Drastically Increased in AP,The Number of Income Tax Payers,Income Tax Payers Drastically Increased,Tax Payers Increased in AP,Mango News,Mango News Telugu,The SBI, AP is increasing massively, paying government tax, last three years, the number of income tax payers,taxpayers,Number of Income Tax Payers News,Income Tax Payers Latest News,Income Tax Payers Latest Updates,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఏపీలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల ఆదాయం భారీగా పెరుగుతోందని ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక వెల్లడించింది. దీంతో పాటు సర్కార్ పన్ను చెల్లించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత మూడేళ్లలో ఏపీలో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య 18 లక్షల పెరిగిందని తెలుస్తోంది. ఏ రాష్ట్రంలోనూ ఇంత పెరుగుదల లేదని నివేదికలో పేర్కొంది. 2015-20 మధ్య దేశవ్యాప్తంగా పన్ను చెల్లించే వారి సంఖ్య 3.81 కోట్లుగా ఉంది. ఈ సంఖ్య 2020-2023 మధ్య కోటి మాత్రమేనని తెలుస్తోంది.

అయితే ఏపీలో మాత్రం గత ఐదు సంవత్సరాల్లో 5 లక్షల మంది ఆదాయపు పన్ను చెల్లించేవారు పెరిగినట్లు నివేదికలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో గత ఎనిమిది ఏళ్లలో 23 లక్షల మంది పన్ను చెల్లించేవారు పెరిగారని నివేదిక చెబుతోంది. ముఖ్యంగా గత 3 సంవత్సరాల్లో ప్రజల ఆదాయం భారీగా పెరిగిందట. తక్కువ ఆదాయం ఉన్నవారు మధ్య తరగతిలోకి, మధ్యతరగతిలో ఉన్నవారు ఎగువ మధ్యతరగతి ఆదాయంలో వెళ్తున్నారని పేర్కొంది. 2023లో ఆదాయపు పున్న దాఖలు చేసిన రాష్ట్రల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, హర్యానా, కర్ణాటక అగ్రభాగాన నిచిచాయి.

2014లో మధ్యతరగతి అవరేజ్ ఆదాయం రూ.4.4 లక్షలు ఉండగా.. ఇది 2023 నాటికి రూ.13 లక్షలకు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. 2047 నాటికి సగటు ఆదాయం రూ.49.7 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో రూ.5 లక్షల ఆదాయం కేటగిరీ నుంచి 10 లక్షల రూపాయల ఆదాయ కేటరిగిరిలో పన్ను చెల్లించే వారు 8.1 శాతం పెరిగారట. 10 లక్షల రూపాయల ఆదాయ కేటగిరి నుంచి రూ.20 లక్షల ఆదాయ కేటగిరికి వెళ్లిన వారు 3.8 శాతంగా ఉన్నారు. కోటికి పైగా ఆదాయ కేటగిరిలో 0.02 శాతం పెరిగారని నివేదిక పేర్కొంది. ఆదాయపు పున్న చెల్లించేవారి ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఇటు దేశ జనాభ 2047 నాటికి 161 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం జనాభాలో ప్రస్తుతం ఉద్యోగులు 37.9 శాతం ఉండగా 2047 నాటికి 45 శాతానికి పెరుగుతారని నివేదిక పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − twelve =