ముగిసిన నటుడు శరత్ బాబు అంత్యక్రియలు.. రజనీకాంత్, రాధిక, సుహాసిని, సూర్య సహా పలువురు నివాళులు

Senior Actor Sarath Babu Last Rites Completed at Chennai Superstar Rajinikanth Hero Surya and Others Pays Tribute,Senior Actor Sarath Babu Last Rites,Sarath Babu Last Rites Completed at Chennai,Superstar Rajinikanth Pays Tribute,Hero Surya and Others Pays Tribute,Mango News,Mango News Telugu,Senior Actor Sarath Babu,Actor Sarath Babu Latest News,Actor Sarath Babu Latest Updates,Actor Sarath Babu Live News,Superstar Rajinikanth,Sarath Babu Last Rites,Rajinikanth pays respects to Sarath Babu

సీనియర్‌ నటుడు శరత్‌ బాబు అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని గిండీలో జరిగిన ఆయన అంతిమ సంస్కారంలో కుటుంబ సభ్యులు, సహచరులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శరత్‌బాబుకి అశ్రునివాళులు అర్పించారు. అంతకుముందు చెన్నై, టీ-నగర్‌లోని శరత్‌బాబు నివాసంలో ఆయన భౌతిక కాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళ్ళర్పించారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ శరత్‌ బాబు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా శరత్‌ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శరత్‌ బాబు ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవారని, ఆయన మొహంలో ఒక్కసారి కూడా కోపాన్ని చూసి ఎరుగనని వ్యాఖ్యానించారు. తనకున్న సిగరెట్‌ అలవాటును మానుకోవాలని సున్నితంగా హెచ్చరించేవారని, ఆరోగ్యం పట్ల ఆయనకు శ్రద్ధ ఎక్కువని తెలిపారు. తనతో కలిసి శరత్‌ బాబు నటించిన చిత్రాలు మంచి విజయం సాధించాయని, మంచి స్నేహితుడిని కోల్పోయానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.

ఇక మరోవైపు తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్, నటి రాధిక దంపతులు శరత్‌ బాబు భౌతిక కాయానికి ఘన నివాళ్ళర్పించారు. ఈ క్రమంలో శరత్ బాబుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసికొని వారు కొంత భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తమిళ అగ్ర హీరో సూర్య, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సహా పలువురు శరత్‌ బాబుకి ఘనంగా నివాళులు అర్పించారు. సీనియర్ నటి సుహాసిని దగ్గరుండి శరత్ బాబు అంత్యక్రియల ఏర్పాట్లు చేయడం విశేషం. కాగా తమిళ, తెలుగు చిత్రాలలో తన పాత్రల ద్వారా పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు శరత్ బాబు సోమవారం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గత నెలలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 71 సంవత్సరాల శరత్ బాబు దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here