హైదరాబాద్‌: హజ్‌ యాత్రికుల కోసం నేటి నుంచి మలక్‌పేటలో శిక్షణ శిబిరం ప్రారంభం

Hyderabad First Orientation Training Camp For Haj Pilgrims Starts From Today at Malakpet, Hyderabad First Orientation Training Camp For Haj Pilgrims Starts From Today, Orientation Training Camp For Haj Pilgrims Starts From Today at Malakpet, First Orientation Training Camp For Haj Pilgrims, Haj Pilgrims, Malakpet, Hyderabad First Orientation Training Camp, First Orientation Training Camp, First Orientation Training Camp News, First Orientation Training Camp Latest News, First Orientation Training Camp Latest Updates, First Orientation Training Camp Live Updates, Mango News, Mango News Telugu,

హజ్-2022 పర్యటహజ్-2022 పర్యటనకు ఎంపిక చేయబడిన హజ్ యాత్రికుల కోసం హైదరాబాద్‌లోని మలక్‌పేటలో తొలి ఓరియంటేషన్‌ శిక్షణ శిబిరం నేటి నుంచి ప్రారంభం కానుంది. నకు ఎంపిక చేయబడిన హజ్ యాత్రికుల కోసం హైదరాబాద్‌లోని మలక్‌పేటలో తొలి ఓరియంటేషన్‌ శిక్షణ శిబిరం నేటి నుంచి ప్రారంభం కానుంది. మలక్‌పేటలోని గోల్నాక కొత్త వంతెన మూసారంబాగ్ రోడ్డు సమీపంలోని హైటెక్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జరుగనుంది. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ హజ్‌ కమిటీ ప్రకటించింది. హజ్ యాత్ర శిక్షణ శిబిరం గురించి చర్చించటానికి కమిటీ మెంబర్స్ నిన్న స్టేట్‌ హజ్‌ భవనంలో సమావేశమయ్యారు. హజ్ శిక్షణకు ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ హాజరుకానున్నారు. హజ్ యాత్రికులందరూ హజ్ శిక్షణా శిబిరానికి తప్పనిసరిగా హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీమ్ కోరారు.

మత పెద్దలు మనసిక్-ఎ-హజ్ మరియు జియారత్-ఇ-మదీనా మునవ్వరా యాత్రకు సంబంధించి ముఖ్యమైన ఏర్పాట్లు మరియు హజ్ ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేయనున్నారు. హజ్ యాత్రికులు హజ్ శిక్షణా శిబిరాల సమయంలో తమ వెంట పసిపిల్లలను లేదా మైనర్ పిల్లలను తీసుకురావద్దని అభ్యర్థించారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణ నుంచి వెయిటింగ్‌ లిస్టులో ఉన్న 553 మంది యాత్రికుల పాస్‌పోర్ట్‌ కాపీ, మెడికల్‌ సర్టిఫికెట్‌, హజ్‌ అప్లికేషన్‌ ఫామ్‌, బ్యాంక్‌ వివరాలు, రెండు డోసుల వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ హజ్‌ కమిటీ ఇండియాకు సమర్పించాలని హజ్‌ కమిటీ సూచించింది. అలాగే యాత్రికులలో అవసరమైన వారికి వ్యాక్సిన్‌ వేయించాలని మంగళవారం కమిటీ నిర్ణయించింది. ట్రైనింగ్‌ క్యాంప్‌కు సంబంధించిన ఇతర వివరాలకు 040-23298793 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని కమిటీ కోరింది. ఈ సమావేశంలో రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ ఎండీ సలీం, వక్ఫ్‌బోర్ట్‌ చైర్మన్‌ మసియుల్లా ఖాన్‌, ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 3 =