ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్‌

US Consul General Joel Reifman Meets AP CM YS Jagan at Camp Office, Joel Reifman Meets AP CM YS Jagan at Camp Office, US Consul General Joel Reifman Meets AP CM, US Consul General Joel Reifman, US Consul General, Joel Reifman, Consul General Joel Reifman Meets AP CM YS Jagan at Camp Office, US Consul General Meets AP CM YS Jagan at Camp Office, Joel Reifman US Consul General, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, AP CM, CM YS Jagan, Mango News, Mango News Telugu,

అమెరికా కాన్సుల్‌ జనరల్‌ (హైదరాబాద్‌) జోయల్‌ రీఫ్‌మెన్‌ తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలిశారు. తన ఫేర్‌వెల్‌ విజిట్‌లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ తో భేటీ అయిన జోయల్‌ రీఫ్‌మెన్‌ పలు అంశాలపై చర్చించారు. అమెరికా-ఆంధ్ర సంబంధాలు మెరుగుపరచడం కోసం, అమెరికా కాన్సులేట్‌కు సీఎం ఇచ్చిన సహకారం, చూపిన చొరవకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అమెరికన్‌ కాన్సులేట్‌కు సత్సంబంధాలు మరింత మెరుగుపడడంలో సీఎం వైఎస్ జగన్ చేసిన కృషిని జోయల్‌ రీఫ్‌మెన్‌ కొనియాడారు.

విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం, పాఠశాల విద్యపై సీఎం తీసుకున్న ప్రోత్సాహక చర్యలను ప్రశంసించారు. వైద్య, ఆరోగ్యరంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కోవిడ్‌ మహమ్మారిని సమర్ధవంతంగా కట్టడి చేయడంలో దేశంలోనే ఏపీని ఉత్తమ రాష్ట్రాలలో ఒకటిగా నిలిపారని జోయల్‌ రీఫ్‌మెన్‌ అన్నారు. విశాఖపట్నంలో అమెరికన్‌ కార్నర్‌ను ప్రారంభించడానికి యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌కు అందించిన సహాయానికి సీఎంకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని గొప్ప నగరాలలో ఒకటిగా రూపొందేందుకు విశాఖపట్నానికి అద్భుత అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆంధ్ర, అమెరికాల మధ్య పెట్టుబడులు, పరిశ్రమలు మరింత మెరుగుపడతాయని జోయల్‌ రీఫ్‌మెన్‌ ఆకాంక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − nine =