హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్‌ బేగ్‌ ఏకగ్రీవంగా ఎన్నిక

Hyderabad Local Authorities Constituency Mlc Election Aimim Candidate Mirza Rahmat Baig Elected Unanimously,Mlc Election Aimim Candidate Mirza Rahmat,Local Authorities Constituency Mlc Election,Mirza Rahmat Elected Unanimously,Mango News,Mango News Telugu,Mlc Elections Telangana,Telangana Mlc Elections 2023,Eligibility To Vote In Mlc Elections,Graduate Mlc Elections In Telangana,Graduate Mlc Elections In Telangana 2023,Graduate Mlc Elections In Ap Date,Mlc Elections,Mlc Elections In Ap,Mlc Elections In Telangana 2022 Apply Online,Mlc Elections In Telangana 2023 Date,Mlc Elections In Telangana 2023 News ,Mlc Elections Registration In Telangana,Mlc Elections Status,Mlc Elections Telangana

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా కింద హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్‌ బేగ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా హైదరాబాద్‌ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలో మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ మిత్రపక్షం అయిన ఎంఐఎం పార్టీ చేసిన విజ్ఞప్తిపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సానుకూలంగా స్పందిస్తూ, ఈ ఎమ్మెల్సీ బరిలో ఉండే ఎంఐఎం పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. దీంతో ఈ స్థానంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మీర్జా రహమత్‌ బేగ్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్‌ రహీంఖాన్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేయగా తిరస్కరణకు గురైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో మీర్జా రహమత్‌ బేగ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికవడంపై రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంక అలా మీర్జా రహమత్‌ బేగ్‌ కు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

కాగా ప్రస్తుతం హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ పదవీ కాలం 2023, మే 1తో పూర్తవనుంది. మరోవైపు మహబూబ్‌నగర్-రంగా రెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహించి, మార్చి 16న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 15 =