అత్యుత్తమ నగరంగా హైదరాబాద్, సర్వేలో‌ నెంబర్ వన్ స్థానం

destination discovery website, est Destination To Live Hyderabad, Holidify.com, Hyderabad, Hyderabad Best Destination To Live And Work In India, Hyderabad Declared Best Destination To Live, Hyderabad Declared Best Destination To Live And Work In India, hyderabad news, Hyderabad ranked best city to live, Hyderabad topped the JLL City Momentum Index 2020, JLL City Momentum Index 2020

హైదరాబాద్ నగరం మరో ఘనత దక్కించుకుంది. డెస్టినేషన్ డిస్కవరీ వెబ్‌సైట్ హాలిడిఫై.కామ్ చేసిన సర్వేలో హైదరాబాద్ అత్యుత్తమ నగరంగా ‌నిలిచింది. భారతదేశంలో నివాసయోగ్యం మరియు ఉపాధి కార్యక్రమాల నిర్వహణ వంటి పలు అంశాలపై 34 నగరాల్లో హాలిడిఫై జరిపిన సర్వేలో హైదరాబాద్‌ నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది. ఈ సర్వే ప్రకారం హైదరాబాద్ నగరాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి మార్చి వరకని పేర్కొన్నారు. చారిత్రాత్మక చార్మినార్, గోల్కొండ కోట, రామోజీ ఫిల్మ్ సిటీతో పాటుగా నగరంలో సందర్శించడానికి ఎన్నో గొప్ప ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌ గొప్పగా అభివృద్ధి చెందుతుందని, దక్షిణ భారతదేశ న్యూయార్క్‌ నగరంగా హైదరాబాద్‌ ను అభివర్ణించారు. అలాగే హైదరాబాద్ నగరం వ్యాపార ప్రయోజనాలు, పరిశ్రమలకు సురక్షితమైన మరియు ఉత్తమమైన ప్రదేశమని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here